ఏపీకి రూ.41 కోట్లు, తెలంగాణకు రూ.37 కోట్లు
పీఎంజీఎస్‌వైకి కేంద్రం నిధుల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన గ్రామ సడక్ యోజన పథకం(పీఎంజీఎస్‌వై) కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం నిధులను పెంచింది. పీఎంజీఎస్‌వై వార్షిక నిధులను ఏపీకి రూ.41 కోట్లు, తెలంగాణకు రూ.37 కోట్లు పెంచుతూ కేంద్ర గ్రామీణాభి వృద్ధిశాఖ నిర్ణయం తీసుకుంది. ఏపీకి రూ.167 కోట్ల వార్షిక నిధులుండగా, దాన్ని రూ.208.70 కోట్లకు, తెలంగాణకు రూ.122 కోట్ల నుంచి రూ.159.20 కోట్లు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్వాగతించారు. నిధులను పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, సామాజిక సంబంధాలు, సేవలు విస్తృతమవుతాయని పేర్కొన్నారు.