యాపిల్ హ్యాకర్లకు బంపర్ ఆఫర్ | Apple will offer cash to hackers for reporting security flaws | Sakshi

యాపిల్ హ్యాకర్లకు బంపర్ ఆఫర్

Aug 5 2016 8:54 AM | Updated on Aug 20 2018 2:55 PM

యాపిల్ హ్యాకర్లకు బంపర్ ఆఫర్ - Sakshi

యాపిల్ హ్యాకర్లకు బంపర్ ఆఫర్

టెక్ దిగ్గజం యాపిల్ సాప్ట్వేర్ అప్లికేషన్లలోకి తలదూర్చుతున్నారా...? లోపాలు వెతికే పనిలో పడ్డారా..? అయితే యాపిల్ సాప్ట్వేర్లో లోపాలను గుర్తించే వారికి ఇది బంపర్ ఆఫరే.

టెక్ దిగ్గజం యాపిల్ సాప్ట్వేర్ అప్లికేషన్లలోకి తలదూర్చుతున్నారా...? లోపాలు వెతికే పనిలో పడ్డారా..? అయితే యాపిల్ సాప్ట్వేర్లో లోపాలను గుర్తించే వారికి ఇది బంపర్ ఆఫరే. లోపాలను గుర్తించి రివార్డులను కొట్టేయొచ్చట. తన కంపెనీ సాప్ట్వేర్లో భద్రతాపరమైన లోపాలను గుర్తించి, తెలియజేసినందుకు హ్యాకర్లకు 2లక్షల డాలర్ల(కోటి 33 లక్షలకు పైగా) వరకు రివార్డును ఆఫర్ చేయనున్నట్టు యాపిల్ ఇంక్ ప్రకటించింది. లాస్ వెగాస్లోని కంప్యూటర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రొగ్రామ్లో యాపిల్ ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రారంభంలో లిమిటెడ్ రీసెర్చర్లకు ఈ రివార్డులను అందిస్తామని, ఈ ప్రొగ్రామ్ను మెల్లమెల్లగా విస్తరిస్తామని గూగుల్ తెలిపింది. కంపెనీ సాప్ట్వేర్లో భద్రతను సీరియస్గా తీసుకున్న యాపిల్, సమస్యను గుర్తించడంలో బయటి వ్యక్తుల సహకారాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ సమాచారాన్ని ఇతరులకు విక్రయించకుండా డైరెక్టుగా కంపెనీకే అందించేలా హ్యాకర్లకు రివార్డులను అందించాలని యాపిల్ నిర్ణయించింది.

తమ కంప్యూటర్ కోడ్ల్లో లోపాలు గుర్తించిన వారిని టెక్ దిగ్గజాలు "బగ్ బౌన్టీస్"గా  పిలుస్తారు. గూగుల్, ఫేస్బుక్ వంటి ఇతర కంపెనీలు తమ సాప్ట్వేర్లో లోపాలను గుర్తించి, కంపెనీకి తెలియజేసినందుకు హ్యాకర్లకు ఎప్పటినుంచో రివార్డులను ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం యాపిల్ సైతం ఈ బాటలోనే పయనించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement