'బాహుబలి-2' సామ్రాజ్యాన్ని చూశారా? | Baahubali Art Director is Designing a New Kingdom For Part 2 | Sakshi
Sakshi News home page

'బాహుబలి-2' సామ్రాజ్యాన్ని చూశారా?

Published Wed, Aug 3 2016 7:14 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

Baahubali Art Director is Designing a New Kingdom For Part 2

'బాహుబలి' సినిమాను వెండితెర దృశ్యకావ్యంగా మలిచి.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాడు దర్శకుడు రాజమౌళి. భారీ బడ్జెట్‌తో, భారీ అట్టహాసంతో తెరకెక్కిన 'బాహుబలి' మహత్తరమైన విజయాన్ని సాధించడంతో 'బాహుబలి-2'పై సర్వత్రా అంచనాలు పెరిగిపోయాయి.

ప్రస్తుతం 'బాహుబలి-2' ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'బాహుబలి' సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సాబు సిరిల్‌ రెండోపార్టు కోసం భారీ సెట్టింగ్స్‌ సిద్ధం  చేస్తున్నాడు. మొదటి పార్టులో కనిపించిన 'బాహుబలి' రాజ్యవైభవాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. 'బాహుబలి' 1, 2 పార్టుల కోసం సృష్టికి ప్రతిసృష్టి చేసి రూపొందిస్తున్న మాహిష్మతి సామ్రాజ్యం గురించి ఆయన వివరించారు.

'నిస్సందేహంగా బహుబలి నా కెరీర్‌లోనే అతిపెద్ద సినిమా. దీని కోసం ఒకేసారి పది సినిమాలకు పనిచేసినట్టు ఉంది. చారిత్రక కథ, యుద్ధనేపథ్యం, భారీ పాత్రలు, సెట్టింగ్స్‌, యోధులు, అడవులు, జంతువులు, రాజరిక వైభవం ఇలా చాలా విషయాల్లో నాకు చాలెంజింగ్‌ మూవీ. కానీ ఈ చాలెంజ్‌ను ఆస్వాదిస్తున్నా. 'బాహుబలి' రెండుపార్టులకు పనిచేయడం పదేళ్లకు సరిపడా జ్ఞానాన్ని అనుభవాన్ని ఇచ్చింది' అని శిబు సిరిల్‌ చెప్పారు. 'బాహుబలి' సినిమా కోసం ఆయన ప్రతిష్టాత్మకమైన శంకర్‌ 'రోబో-2' ప్రాజెక్టు ఆఫర్‌ను కూడా వదులుకున్నారు. 'బాహుబలి-2' కోసం ఆయన సిద్ధం చేసిన సెట్టింగ్స్‌ స్టిల్స్‌ను 'ఐఫ్లిక్జ్‌.కామ్‌' ప్రచురించింది. 'బాహుబలి-2' సెట్స్‌ కోసం దాదాపు 300 నుంచి 500 మంది పనిచేస్తున్నారు. పెయింటర్లు మొదలు కార్పెంటర్లు, వెల్డర్లు, భవన నిర్మాణ కార్మికులు, కళాకారులు ఇలా చాలామంది ఈ సినిమా కోసం కష్టపడుతూ అత్యద్భుతమైన సెట్లను తీర్చిదిద్దుతున్నారు.


Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement