Sabu Cyril
-
వేసవిలో తాపం తగ్గేలా సగ్గుబియ్యంతో హల్వా చేద్దాం ఇలా!
చలికాలం... సగ్గుబియ్యం హల్వా తింటే జలుబు చేస్తోందా! అయితే... ఇదే మంచి సమయం. ఎండల్లో వండుకుందాం. సగ్గుబియ్యం చలవ చేస్తుంది... ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. దహీ... కేసర్... కోవాతోపాటు పొటాటోతోనూ కలిసిపోతుంది. ఈవెనింగ్ స్నాక్ అవుతుంది...లంచ్‌లో మెయిన్ కోర్స్ అవుతుంది. భోజనం తర్వాత డెజర్ట్ గానూ సర్దుకుపోతుంది. అలాంటి సగ్గుబియ్యంతో సాబుదానా హల్వా చేద్దామిలా!. తయారీకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం– కప్పు చక్కెర – కప్పు నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు ఫుడ్ కలర్– చిటికెడు ఏలకుల పొడి– అర టీ స్పూన్ జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు కిస్మిస్ – టేబుల్ స్పూన్ పాల కోవా– 2 టేబుల్ స్పూన్లు లేదా చిక్కటి పాలు కప్పు; నీరు – 2 కప్పులు. తయారీ విధానం: సగ్గుబియ్యాన్ని కడిగి నీరు పోసి ప్రెషర్ కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్లను వేయించాలి. వేగిన జీడిపప్పు, కిస్మిస్ను తీసి పక్కన పెట్టి అదే బాణలిలో ఉడికిన సగ్గుబియ్యం, చక్కెర, ఫుడ్ కలర్ వేసి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు పాల కోవా వేసి కలపాలి. కోవా లేకపోతే పాలు పోసి, ఏలకుల పొడి వేసి దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి కలిపితే సాబుదానా హల్వా రెడీ. (చదవండి: మసాలా ఎక్కువై కూర పాడవ్వకూడదంటే ఇలా చేయండి! టేస్ట్ అదిరిపోతుంది) -
ఆస్కార్‌లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ
ప్రతి ఏడాది ఆస్కార్ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు విజేతల నిర్ణయానికి ఈ సభ్యుల ఓటింగ్ కీలకంగా నిలుస్తుంది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న జరగనుంది. కాగా ‘క్లాస్ ఆఫ్ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్ కమిటీ సీఈవో బిల్ క్రామెర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్ వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి దాదాపు 15 మందికి ఆహ్వానం అందడం విశేషం. తెలుగు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లో ఆరుగురు, తమిళం నుంచి మణిరత్నం, బాలీవుడ్‌నుంచి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వంటివారు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు వంటి అంశాల ఆధారంగా ఈ ‘క్లాస్ ఆఫ్ 2023’ జాబితాను తయారు చేసినట్లు అకాడమీ పేర్కొంది. ఈ 398 మందిలో 51 దేశాలకు చెందినవారు ఉండగా, వీరిలో 40 శాతం మంది మహిళలు, 52 శాతం మంది యూఎస్‌కు చెందనివారు ఉన్నట్లుగా ఆస్కార్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ కొత్త సభ్యులతో కలిసి ఆస్కార్ మెంబర్‌షిప్‌లు కలిగి ఉన్నవారి సంఖ్య 10, 817కు చేరినట్లు హాలీవుడ్ అంటోంది. ఆర్ఆర్ఆర్ నుంచి ... ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకుగాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ యంయం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌లకు అకాడమీ ఆహ్వానాలు అందాయి. అలాగే ఈ చిత్రం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌లు కూడా ఆస్కార్ అకాడమీ సభ్యులు కానున్నారు. దర్శకులు మణిరత్నం, షౌనక్ సేన్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ దర్శకుడు), నిర్మాతలు కరణ్ జోహర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపబడిన గుజరాతీ ఫిల్మ్ ‘ది ఛెల్లో షో’ నిర్మాత), చైతన్య తమ్హానే (మరాఠీ), ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీకి చెందిన గిరీష్ బాలకృష్ణన్, క్రాంతి శర్మ, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌లు హరేష్ హింగో రాణి, పీసీ సనత్, ఫిల్మ్ ఎగ్జిక్యూ టివ్‌లు శివానీ రావత్, శివానీ పాండ్యా మల్హోత్రా వంటివారు ఉన్నారు. గర్వంగా ఉంది – రాజమౌళి ‘‘ఆస్కార్ అకాడమీ సభ్యత్వ నమోదు కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి ఆరుగురికి ఇన్విటేషన్స్ రావడం గర్వంగా ఉంది. వీరితో పాటు భారతదేశం తరఫున ఆస్కార్ ఆహ్వానం అందుకున్నవారికి కూడా నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. కొత్త రూల్ ఓ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపాలంటే కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. యూఎస్‌లోని ఆరు ప్రధాన నగరాల్లో (న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో, మియామి, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో) ఆ సినిమా కనీసం ఏడు రోజులు ప్రదర్శితం కావాలి. వీటిలో ఒక షో సాయంత్రం ప్రైమ్ టైమ్‌లో ఉండాలి, థియేటర్స్‌లో కనీస సీటింగ్ సామర్థ్యం ఉండాలి. తాజాగా బెస్ట్ పిక్చర్, ఫారిన్ బెస్ట్ ఫిల్మ్ విభాగాలకు సంబంధించి కొత్త రూల్ పెట్టనున్నారట. ఇకపై ఆస్కార్‌కు ఓ సినిమాను పంపాలంటే యూఎస్‌లోని పాతికకు పైగా మూవీ మార్కెట్స్ ఉన్నచోట సినిమాలు ప్రదర్శించబడాలట. అది కూడా రెండువారాలకు పైగా. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ కొత్త రూల్‌ను 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం (2025) నుంచి అమలులోకి తేవాలని అవార్డ్ కమిటీ ప్లాన్ చేస్తోందన్నది హాలీవుడ్ టాక్. ఆ నలుగురికీ గౌరవం ‘‘ఈ నలుగురూ చలన చిత్రపరి శ్రమలో మంచి మార్పుకు నాంది అయ్యారు. తర్వాతి తరం ఫిల్మ్ మేకర్స్‌కి, ఫ్యాన్స్‌కి స్ఫూర్తిగా నిలిచారు. వీరిని సత్కరించడం ‘బోర్డ్ ఆఫ్ గవర్నర్స్’కి థ్రిల్‌గా ఉంది’’ అని ఆస్కార్ అకాడమీ అవార్డ్ అధ్యక్షుడు జానెట్ యాంగ్ అన్నారు. సినిమా రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ‘గవర్నర్ అవార్డ్స్’లో భాగంగా హానరరీ ఆస్కార్ అవార్డ్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఈ గౌరవ ఆస్కార్‌ను అందుకోనున్న నలుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. నటి ఏంజెలా బాసెట్, రచ యిత–దర్శకుడు–నటుడు–గేయ రచయిత మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్లతో పాటు సన్డాన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన మిచెల్ సాటర్‌లకు అవార్డును అందజేయనున్నారు. నవంబర్ 18న లాస్ ఏంజెల్స్‌లోని ఫెయిర్మాంట్ సెంచరీ ప్లాజాలో జరిగే వేడుకలో ఈ నలుగురూ గౌరవ పురస్కారాలు అందుకుంటారు. -
భల్లాల దేవుడి రథం ఎలా పరుగులు తీసింది?
వెయ్యికోట్ల కలెక్షన్లు దాటిన మొట్టమొదటి భారతీయ సినిమాగా బాహుబలి-2 రికార్డులు బద్దలుకొట్టింది. చాలావరకు థియేటర్లలో ఇప్పటికీ ఏ రోజు టికెట్లు ఆరోజు దొరకడం కష్టంగానే ఉండటంతో రూ. 1500 కోట్లు కూడా దాటేయొచ్చని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాలో చాలా విశేషాలే ఉన్నా.. అన్నింటికంటే ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవాటిలో భల్లాల దేవుడు వాడిన కత్తుల రథం ఒకటి. ముందు భాగంలో కత్తులతో కూడిన ఆ రథం మీద భల్లాలదేవుడు మొదటి భాగంతో పాటు రెండో భాగంలో కూడా హల్చల్ చేస్తాడు. మొదటి భాగంలో ఆ రథం ఎలా నడిచిందో కూడా చూపించలేదు గానీ, రెండో భాగంలో మాత్రం దున్నపోతులు దాన్ని లాక్కెళ్తున్నట్లు గ్రాఫిక్స్‌లో చూపించారు. అయితే అసలు ఆ రథం అంత శరవేగంగా ఎలా వెళ్లిందన్నది ఇప్పటికీ చాలామందికి తెలియని రహస్యమే. దానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ ఉపయోగించారట. ఆ విషయాన్ని సినిమా ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దాని శక్తితోనే కావల్సినంత వేగంగా రథం వెళ్లింది. ఈ రథాన్ని పూర్తిగా సాబు సిరిల్, ఆయన బృందమే తయారుచేసింది. అంతేకాదు.. రథం ముందు భాగంలో ఒక కారు స్టీరింగ్, దానికి ఒక డ్రైవర్ కూడా ఉన్నారట. ఆ డ్రైవరే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్‌తో కూడిన రథాన్ని నడిపిస్తుంటారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్లు సులభంగా ఎక్కడైనా బిగించే అవకాశం ఉండటం, దానికితోడు మంచి వేగంగా తీసుకెళ్లగలిగే శక్తి ఉండటంతో దాన్నే ఈ రథానికి ఉపయోగించుకున్నారు. 350 లేదా 500 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్‌ను ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. -
ఇద్దరు అగ్రనటులు 20 ఏళ్ల తర్వాత..
తిరువనంతపురం: అగ్రనటులు మోహన్‌లాల్, ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరో భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకోనుంది. చివరిసారిగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్వకత్వంలో ఇరవయ్యేళ్ల కిందట ప్రకాశ్‌రాజ్, మోహన్‌లాల్ కలిసి ‘ఇరువార్’ అనే చిత్రంలో నటించారు. పాలక్కాడ్ ప్రాంతంలో ఉండే గిరిజన తెగకు సంబంధించిన కథనంతో ‘ఒడియాన్’ టైటిల్‌తో రానున్న ఈ మలయాళ సినిమా ఓ సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీలో మోహన్‌లాల్ సరసన మంజు వారియర్ నటించనున్నారు. తమిళం, తెలుగు భాషల్లోనూ మూవీ విడుదల చేస్తారు. అంతేకాదు, ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోలతో చర్చలు సాగుతున్నట్లు సమాచారం. కేరళ పాలక్కాడ్-మలబార్ ప్రాంతంలో ఉండే గిరిజన తెగకు సంబంధించిన కథనంతో ఈ సినిమా నడుస్తుంది. ఈ గిరిజనులకు మనుషులు, జంతువులు ఇలా ఏ రూపంలోకైనా మారే అద్భుత శక్తులుంటాయని.. ఇదివరకు ఎవరూ వినని కథనమని డైరెక్టర్ వీఏ శ్రీకుమార్ మీనన్ చెప్పారు. పాలక్కాడ్, థజారక్, పొల్లాచి, వారణాసి, హైదరాబాద్ ప్రాంతాలలో షూటింగ్ చేస్తామన్నారు. నవంబర్‌లో ఒడియాన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆశీర్వాద్ బ్యానర్లో మే 25 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు కథ రచయిత హరికృష్ణ కాగా, ఆంటోనీ పెరుంబువూర్ మూవీని నిర్మిస్తారని సమాచారం. -
'బాహుబలి-2' సామ్రాజ్యాన్ని చూశారా?
'బాహుబలి' సినిమాను వెండితెర దృశ్యకావ్యంగా మలిచి.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాడు దర్శకుడు రాజమౌళి. భారీ బడ్జెట్‌తో, భారీ అట్టహాసంతో తెరకెక్కిన 'బాహుబలి' మహత్తరమైన విజయాన్ని సాధించడంతో 'బాహుబలి-2'పై సర్వత్రా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం 'బాహుబలి-2' ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'బాహుబలి' సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాబు సిరిల్ రెండోపార్టు కోసం భారీ సెట్టింగ్స్ సిద్ధం చేస్తున్నాడు. మొదటి పార్టులో కనిపించిన 'బాహుబలి' రాజ్యవైభవాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. 'బాహుబలి' 1, 2 పార్టుల కోసం సృష్టికి ప్రతిసృష్టి చేసి రూపొందిస్తున్న మాహిష్మతి సామ్రాజ్యం గురించి ఆయన వివరించారు. 'నిస్సందేహంగా బహుబలి నా కెరీర్లోనే అతిపెద్ద సినిమా. దీని కోసం ఒకేసారి పది సినిమాలకు పనిచేసినట్టు ఉంది. చారిత్రక కథ, యుద్ధనేపథ్యం, భారీ పాత్రలు, సెట్టింగ్స్, యోధులు, అడవులు, జంతువులు, రాజరిక వైభవం ఇలా చాలా విషయాల్లో నాకు చాలెంజింగ్ మూవీ. కానీ ఈ చాలెంజ్‌ను ఆస్వాదిస్తున్నా. 'బాహుబలి' రెండుపార్టులకు పనిచేయడం పదేళ్లకు సరిపడా జ్ఞానాన్ని అనుభవాన్ని ఇచ్చింది' అని శిబు సిరిల్ చెప్పారు. 'బాహుబలి' సినిమా కోసం ఆయన ప్రతిష్టాత్మకమైన శంకర్ 'రోబో-2' ప్రాజెక్టు ఆఫర్‌ను కూడా వదులుకున్నారు. 'బాహుబలి-2' కోసం ఆయన సిద్ధం చేసిన సెట్టింగ్స్ స్టిల్స్‌ను 'ఐఫ్లిక్జ్.కామ్' ప్రచురించింది. 'బాహుబలి-2' సెట్స్ కోసం దాదాపు 300 నుంచి 500 మంది పనిచేస్తున్నారు. పెయింటర్లు మొదలు కార్పెంటర్లు, వెల్డర్లు, భవన నిర్మాణ కార్మికులు, కళాకారులు ఇలా చాలామంది ఈ సినిమా కోసం కష్టపడుతూ అత్యద్భుతమైన సెట్లను తీర్చిదిద్దుతున్నారు.