బ్యాంక్ కొలువుల జాతర
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో వచ్చే 5-10 ఏళ్లలో 20 లక్షల కొత్త కొలువులు వస్తాయని నిపుణులంటున్నారు. కొత్త సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇవ్వనుండడం, గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించడానికి భారత రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయనుండడం తదితర కారణాల వల్ల బ్యాంకింగ్ రంగంలో కొత్త ఉద్యోగాలు భారీ స్థాయిలో వస్తాయని వారంటున్నారు. ఈ ఏడాది అత్యధిక ఉద్యోగాలిచ్చే రంగాల్లో బ్యాంకింగ్ కూడా ఒకటిగా నిలవనున్నది. ర్యాండ్‌స్టాడ్ ఇండియా మెరిట్‌ట్రాక్ సర్వీసెస్, మణిపాల్ అకాడెమీ ఫర్ బ్యాంకింగ్, మేరాజాబ్ ఇండియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం...
{పభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు సగం సిబ్బంది సమీప భవిష్యత్తులో రిటైర్ కానున్నారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించుకోవడం ఆయా బ్యాంకులకు తప్పనిసరి. దీంతో ఒక్క పీఎస్ బ్యాంకుల్లోనే 5-7 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి.
బ్యాంకింగ్ రంగ విస్తరణ, నేరుగా నియామకాలు కారణంగా బ్యాంకింగ్ రంగంలో వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో కొలువులు వస్తాయి.
ఈ ఏడాది ప్రథమార్థంలోనే కొత్త బ్యాంక్ లెసైన్స్‌లను ఆర్‌బీఐ జారీ చేయనున్నది. దీంతో సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగంలో అవకాశాలు పెరుగుతాయి.
{పస్తుతం భారత దేశ జనాభాలో కేవలం 30 శాతం కంటే తక్కువ మందికే బ్యాంక్ అకౌంట్లున్నాయి. గ్రామీణ మార్కెట్లలో బ్యాంకుల విస్తరణ వల్ల లాభదాయకత, వృద్ధి పెరుగుతాయి.
గతేడాది ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
గతేడాది ప్రభుత్వ రంగ సంస్థలు 60,000-70,000 ఉద్యోగాలివ్వగా, ప్రైవేట్ బ్యాంకులు 40 వేల వరకూ ఉద్యోగాలిచ్చాయి. ముంబై, చెన్నై, ఎన్‌సీఆర్ రీజియన్‌లో బ్యాంక్ కొలువులు ఎక్కువగా వచ్చాయి.
చిన్న నగరాల్లో అధిక సంఖ్యలో బ్యాంక్ కొలువులు రానున్నాయి.
బ్యాంకు ఉద్యోగుల ఉత్పాదకత పెరగ్గా, ఉద్యోగుల వలస తగ్గింది.
క్లర్క్‌లు, ప్రారంభ స్థాయి ఆఫీసర్ల ఉద్యోగాలు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.