బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయంతో దేశంలో సంస్కరణల వేగం మందగించవచ్చని, స్టాక్ మార్కెట్లను
బిహార్ ఫలితాలపై బార్ల్కేస్ అభిప్రాయం
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయంతో దేశంలో సంస్కరణల వేగం మందగించవచ్చని, స్టాక్ మార్కెట్లను బలహీనపరచవచ్చని లండన్‌కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్ వ్యవహారాలు, బ్రోకరేజీ సంస్థ బార్ల్కేస్ తెలిపింది. ‘భారత ఆర్థిక మార్కెట్లు రాజకీయ ఒడిదుడులతో ప్రభావితం అవుతుంటాయి. బీజేపీకి వచ్చిన వ్యతిరేక ఫలితాలు స్టాక్ మార్కెట్లను బలహీనపర్చొచ్చు. సోమవారం నాటి మార్కెట్‌లో 2 నుంచి 2.5 శాతం వరకు మార్పులు ఉండవచ్చు. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి మరింత బలహీనపడొచ్చు’ అని ఆ సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.