
నరేంద్ర మోడీకి అహ్మదాబాద్ కోర్టులో ఊరట
అహ్మదాబాద్:2002 అల్లర్ల కేసులో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అహ్మదాబాద్ కోర్టులో ఊరట లభించింది. మోడీకి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ను అహ్మదాబాద్ కోర్టు తోసి పుచ్చింది. దీనిపై ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అల్లర్లకు సంబంధించి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేసిన జకియా అహ్మదాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు సిట్ నిర్ణయాన్ని సమర్ధించింది. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన అల్లర్లలో మరణించిన 68 మందిలో కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ ఒకరు.