ఆకాశంలో పక్షుల అలజడి
అది నేపాల్ రాజధాని నగరంలోని చరిత్రాత్మక దర్బార్ స్క్వేర్. శనివారం మధ్యాహ్నం. నీలాకాశం నిశ్శబ్దంగా ఉంది. మంద్రంగా సంగీతం వినిపిస్తోంది. అక్కడి ప్రజలు సంతోషంగా కబుర్లు చెప్పుకొంటున్నారు. ఇంతలో కాళ్ల కింద భూమిలో ప్రకంపనలు మొదలయ్యాయి. కళ్ల ముందే చుట్టుపక్కల భవనాలు కూలుతున్నాయి. ఓ పక్క దర్బార్ కట్టడం ఒరిగిపోతోంది. ఆకాశంలో హఠాత్తుగా నిశ్శబ్దాన్ని చీలుస్తూ వేలాది పక్షులు పిచ్చిక్కెనట్టు గోల చేస్తూ, టప టప...రెక్కల శబ్దం చేస్తూ చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి.
ముంచుకొస్తున్న ప్రళయాన్ని ముందుగానే పసిగట్టిన వాళ్లు వీధుల్లో అటూ ఇటూ పరుగులు తీశారు. ధూళి మేఘాలు దట్టంగా అలుముకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పక్షుల అలజడిని ఓ పర్యాటక వీడియోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. ఆ వీడియోను ‘సోజ్కు’ వెబ్ టీవీ ప్రసారం చేసింది.