ఎమ్మెల్యేలు వేలిముద్రగాళ్లా? | BJP MLA Vishnu Kumar Raju Criticism on Assembly! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలు వేలిముద్రగాళ్లా?

Published Wed, Dec 23 2015 1:21 AM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

ఎమ్మెల్యేలు వేలిముద్రగాళ్లా? - Sakshi

ఎమ్మెల్యేలు వేలిముద్రగాళ్లా?

నిలదీసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వంలో మాట లే తప్ప చేతలు కనిపించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. విశాఖపట్నంలో కొండచరియలు విరిగిపడడం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాల గురించి ఆయన మంగళవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో  కొండవాలుపై ఉన్న ఇళ్లన్నీ అనధికారిక నిర్మాణాలే.

వాటిని తొలగించి, నివాసితులకు పునరావాసం కల్పించేందుకు  ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ కమిటీలో ప్రజాప్రతినిధులకు స్థానం కల్పించకపోవడం సరైంది కాదు. ప్రభుత్వం ఏమనుకుంటోంది? ఎమ్మెల్యే లు గతంలోలా వేలిముద్రగాళ్లనుకుంటోం దా? ఎమ్మెల్యేలకూ కొంత బుర్ర ఉందని ప్రభుత్వానికి తెలియదా? కమిటీల్లో అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యేని కూడా నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?’’ అని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement