దేశంకోసం మళ్లీ మళ్లీ పుడతా: నరేంద్ర మోడీ | BJP PM candidate Narendra Modi to address youth rally in Gujarat today | Sakshi
Sakshi News home page

దేశంకోసం మళ్లీ మళ్లీ పుడతా: నరేంద్ర మోడీ

Published Fri, Feb 21 2014 1:50 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

దేశంకోసం మళ్లీ మళ్లీ పుడతా: నరేంద్ర మోడీ - Sakshi

దేశంకోసం మళ్లీ మళ్లీ పుడతా: నరేంద్ర మోడీ

గుజరాత్ యువకుల సభలో నరేంద్ర మోడీ
 అహ్మదాబాద్/పాట్నా: సీబీఐని ప్రయోగించినా, ఎంతలా బురద చల్లడానికి ప్రయత్నించినా దేశానికి సేవ  చేయాలనే తన లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. గురువారం ఇక్కడ యువకుల భారీ సభలో భావోద్వేగంతో ప్రసంగించిన మోడీ.. కీర్తి కోసమో, మరే ఇతర పదవి కోసమో స్వస్థానాన్ని వదులుకోనని స్పష్టం చేశారు. జన్మజన్మలకు దేశానికి సేవచేయడానికే తాను పుట్టానన్నారు. ఒకవేళ ఈ జన్మలో ఆ అవకాశం రాకపోతే దేశానికి సేవచేయడానికి మళ్లీ పుడతానని చెప్పారు. ఇంతకన్నా ఇతరత్రా లక్ష్యాలు తనకేమీ లేవన్నారు.
 
 జనాభాలో అధికశాతం ఉన్న యువత పట్ల అధికారంలో ఉన్న వారు ఆలోచించాలని, వారికి నైపుణ్య శిక్షణనివ్వడం, ఉద్యోగాలు కల్పించడం తది తర కార్యక్రమాలు చేయాలని చెప్పారు. అలా చేయకపోతే యువశక్తి నిర్వీర్యం అయిపోతుందన్నారు. నైపుణ్య శిక్షణపై గతేడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో కేవలం ఐదు శాతం మాత్రమే పూర్తి చేసిందని, ఇదే రీతిలో పనిచేస్తే మరో ఇరవైఏళ్లు గడిచినా లక్ష్యాన్ని చేరుకోలేరని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement