గణపతి ఉత్సవాల్లో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది.
ప్రకాశం: గణపతి ఉత్సవాల్లో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తూ కరెంట్ షాక్తో బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని వేటపాలెం గణేశుని ఉత్సవాల్లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో ఆలకరించిన మండపం వద్ద సాయి లోకేశ్వరరెడ్డి (10) కరెంట్ షాక్ తగిలింది.
దాంతో బాలుడు అక్కడిక్కడికే కుప్పకూలిపోయాడు. కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.