గంగనదిలో పడవ మునక: నలుగురు గల్లంతు | Boy drowns, four others missing in boat tragedy | Sakshi
Sakshi News home page

గంగనదిలో పడవ మునక: నలుగురు గల్లంతు

Published Sun, Aug 18 2013 12:41 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

Boy drowns, four others missing in boat tragedy

ముంగేర్ జిల్లాలో ఈ రోజు ఉదయం గంగానదిలో బోటు బోల్తా పడిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారని జిల్లా ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. సీతాచరణ్ నది ప్రాంతం నుంచి 24 మంది ప్రయాణీకులతో వస్తున్న బోటు బాబువా ఘాట్ వద్ద అదుపు తప్పి బోల్తా పడిందని చెప్పారు. అయితే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

 

అందుకోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినట్లు చెప్పారు. గల్లంతైన వారిలో ఏడాది వయస్సు గల చిన్నారి కాకుండా మరో నలుగురు ఉన్నారని ఉన్నతాధికారి వెల్లడించారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. అయితే ఆ మహిళలు పడవ మునిగిపోతుందన్న భయంతో నదిలో దూకారని తోటి ప్రయాణీకులు తెలిపారని ఉన్నతాధికారి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement