మా అమ్మ కన్నా నేనే చాలా క్లెవర్‌! | Britney Spears son thinks he is more clever than her | Sakshi
Sakshi News home page

మా అమ్మ కన్నా నేనే చాలా క్లెవర్‌!

Published Sun, Sep 11 2016 9:53 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

మా అమ్మ కన్నా నేనే చాలా క్లెవర్‌!

మా అమ్మ కన్నా నేనే చాలా క్లెవర్‌!

లాస్‌ ఏంజిల్స్‌: 'మా అమ్మ కన్నా నాకే తెలివి ఎక్కువ' అని పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్‌ కొడుకు సియాన్‌ ప్రిస్టన్‌ బడాయి పోతున్నాడట. తన పాటలతో సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన బ్రిట్నీకి మాజీ భర్త కెవిన్ ఫెడర్లైన్ ద్వారా ఇద్దరు కొడుకులు ఉన్నారు.  చిన్నోడు తొమ్మిదేళ్ల జేడెన్‌ తాను హోంవర్క్‌ చేసుకునేటప్పుడు తల్లి సహకారం తీసుకుంటాడట. కానీ పెద్దోడు సియాన్‌ మాత్రం తన పని తాను చేసుకోవడం తప్ప అమ్మ సాయాన్ని అసలు తీసుకోడట.

'జేడెన్‌తో కలిసి డ్రాయింగ్స్‌ వేయడం నాకు చాలా ఇష్టం. హోంవర్క్‌ చేయడంలోనూ వాడికి సాయపడుతుంటా. జేడెన్‌ కూడా ఇందుకు ఒప్పుకుంటాడు. కానీ సియాన్‌ మాత్రం అస్సలు ఒప్పుకోడు. వాడు చాలా స్మార్ట్‌. నా కన్నా తనే చాలా తెలివిగలవాడినని భావిస్తూ ఉంటాడు. తన పని తానే చేసుకుంటాడు. సరే అలాగే కానివ్వు అని నేనూ అనుకుంటాను. కానీ, వాడు చాలా బుద్ధిమంతుడు' అని బ్రిట్నీ స్పియర్‌ 'ఫిమెల్‌ ఫస్ట్‌.కామ్‌'కు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement