బల్క్ ఎస్‌ఎంఎస్‌లపై ఈసీ పర్యవేక్షణ
సిమ్లా: ఎన్నికల సమయంలో అభ్యర్థులు, పార్టీలు పంపే బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, రికార్డ్ చేసిన వాయిస్ మెసేజీలను పర్యవేక్షించాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఎన్నికల నియమావళి, చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రచారంతో పాటు ప్రత్యర్థులపై బురద జల్లేందుకు అభ్యర్థులు బల్క్ ఎస్‌ఎంఎస్‌లను, వాయిస్ మెసేజీలను పెద్ద మొత్తంలో పంపుతున్న నేపథ్యంలో వీటిపై దృష్టి సారించనున్నట్లు ఈ మేరకు ముఖ్య ఎన్నికల అధికారి నరీందర్ చౌహాన్ వెల్లడించారు. బల్క్ ఎస్‌ఎంఎస్‌లను పోలీసు అధికారులు పర్యవేక్షించేందుకు, వీటి వ్యయాన్నీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులో చేర్చేందుకు మార్గదర్శకాలను కూడా జారీ చేశామని తెలిపారు.