తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగినా, హైదరాబాద్‌పై ఏ మాత్రం మెలిక పెట్టినా సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌లో ఉండలేరని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగినా, హైదరాబాద్‌పై ఏ మాత్రం మెలిక పెట్టినా సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌లో ఉండలేరని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధిష్టానం దయాదాక్షిణ్యాలతో పదవులు అనుభవిస్తున్న సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలంగాణపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి పాలన పెట్టయినా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు పట్టించుకోవాలని కేంద్రాన్ని కోరుతున్న సీఎంకు తెలంగాణ ప్రజల మనోభావాలు అక్కరలేదా? వెయ్యి మంది విద్యార్థుల ప్రాణత్యాగాలు గుర్తులేదా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యమానికి సహకరిస్తున్న ఐఏఎస్ అధికారులు తీరు మార్చుకోవాలన్నారు.