విశాఖపట్నం : కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడిపై ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆదివారం విశాఖపట్నంలో మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రులు మండుటెండలో ఉద్యమాలు చేస్తే అది రాజకీయమా అని ఆయన వెంకయ్యను ప్రశ్నించారు. పార్లమెంటులో ఏసీలో కూర్చుని వెంకయ్య చేసేది వికృత రాజకీయం కాదా అని వెంకయ్యను చలసాని శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. 22లోగా ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. లేకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి వెళ్లే కరెంట్ సంబంధించిన ఫ్యూజ్లను పీకేస్తామని చలసాని శ్రీనివాస్ తెలిపారు.