
గవర్నర్ విందుకు చంద్రబాబు, కేసీఆర్ దూరం
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనేటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గైర్హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ తేనేటి విందును ఏర్పాటు చేశారు.
గవర్నర్ ఈ విందుకు చంద్రబాబు , కేసీఆర్ సహా పలువురు నేతలు, ప్రముఖులను ఆహ్వానించారు. అయితే ఈ తేనేటి విందుకు చంద్రబాబు, కేసీఆర్ హాజరుకాలేదు. వివిధ పార్టీల నేతలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విందుకు హాజరయ్యారు.