కౌలాలాంపూర్ : వియత్నాం వద్ద సముద్రంలో విమానం కూలిపోయిందనడానికి ఎలాంటి సమాచారం లేదని మలేషియన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. అటువంటి సంకేతాలు తమకు అందలేదని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామని, వియత్నం ప్రభుత్వం కూడా సమాచారాన్ని అందించాల్సి ఉందని మలేషియన్ ప్రభుత్వం పేర్కొంది.
కౌలాలంపూర్లోని బీజింగ్కు బయలుదేరిన విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. కాగా కూలిపోయిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంలో అయిదుగురు భారతీయులు ఉన్నట్లు తాజాగా తెలియవచ్చింది. మొత్తం 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో కలిసి కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన ఈ విమానానాకి తెల్లవారుజామున ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. కౌలాలంపూర్లోని గత అర్థరాత్రి 12.41 నిమిషాలకు బయలుదేరిన విమానం బీజింగ్ ఈ రోజు ఉదయం 6.30 నిముషాలకు చేరుకోవాల్సి ఉంది.
తెల్లవారుజామున 2.40 ప్రాంతంలో ఆ విమానం అదృశ్యమైంది. ఆ విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మలేషియా ఎయిర్లైన్స్ వెల్లడించింది. అదృశ్యమైన విమానంలో 150 మంది ప్రయాణికులు చైనీయులు ఉన్నారని చైనా పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది.
'మావద్ద ఎలాంటి సమాచారం లేదు'
Published Sat, Mar 8 2014 2:27 PM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
Advertisement
Advertisement