టీచర్ చెప్పిందని.. | Chinese teacher 'forced' 10yo boy to jump to his death after failing school task | Sakshi
Sakshi News home page

టీచర్ చెప్పిందని..

Published Sat, Nov 2 2013 2:21 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

టీచర్ చెప్పిందని.. - Sakshi

టీచర్ చెప్పిందని..

టీచర్ చెప్పిందని చైనాలో ఓ పిల్లాడు 30 అంతస్తుల పై నుంచి దూకి చనిపోయాడు. చైనాలోని చెంగ్డూలో ఐదవ క్లాసు చదువుతున్న జున్‌జున్ క్లాసు జరుగుతుండగా అల్లరి చేయడంతో చెన్ అనే టీచర్ వెయ్యి అక్షరాలకు తగ్గకుండా క్షమాపణ పత్రం రాయమని ఆదేశించింది. రాయలేకుంటే.. ఇంటిపై నుంచి దూకమని ఆమె అన్నట్లు జున్‌జున్ బంధువులు చెబుతున్నారు. దీనికి సాక్ష్యంగా జున్‌జున్ తన నోట్ బుక్‌పై రాసుకున్న మాటలను చూపుతున్నారు.
 
 అందులో.. ‘టీచర్ నేనిది చేయలేకపోతున్నాను. బిల్డింగ్ మీద నుంచి దూకడానికి చాలాసార్లు ప్రయత్నించాను. భయమేస్తోంది’ అని రాసి ఉంది. అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకిన జున్‌జున్ కింద ఉన్న కారుపై పడి.. మరణించాడు. తాజా ఘటన నేపథ్యంలో పిల్లలపై పాఠశాలలో పెరుగుతున్న ఒత్తిడికి వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపట్టాలని జున్‌జున్ తల్లిదండ్రులు యోచిస్తున్నారు. అయితే, ఇది ఓ ప్రమాదం మాత్రమేనని స్కూలు యాజమాన్యం వాదిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement