హైదరాబాద్‌లో క్లిక్‌2క్లినిక్‌ వైద్య సేవలు | Click2 Clinic Medical Services in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో క్లిక్‌2క్లినిక్‌ వైద్య సేవలు

Published Wed, Aug 2 2017 1:35 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Click2 Clinic Medical Services in Hyderabad

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంటి వద్దకే వైద్య సేవలందిస్తున్న క్లిక్‌2క్లినిక్‌ హెల్త్‌కేర్‌ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే ఈ కంపెనీ బెంగళూరుతోపాటు కౌలాలంపూర్, బ్యాంకాక్‌ తదితర నగరాల్లో విస్తరించింది. శిక్షణ పొందిన నర్సులు, ఫిజియోథెరపిస్టులు, డాక్టర్లు ఇంటి వద్దకే వచ్చి వైద్యం అందిస్తారు. రక్త నమూనాల సేకరణ, మందులను ఇంటికి తెచ్చివ్వడం వంటివీ చేస్తారు. క్లినికోపీడియా యాప్‌ ద్వారా ఈ కంపెనీ సేవలు పొందవచ్చు.

సర్వీసును బట్టి చార్జీ చేస్తారు. రోగులతో ప్రతిరోజు వైద్యులు ఫోన్‌లో మాట్లాడతారు. సీనియర్‌ వైద్యులు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తారని కంపెనీ వ్యవస్థాపకులు పున్నం సుజీత్‌ రెడ్డి మంగళవారమిక్కడ తెలిపారు. హైదరాబాద్‌లో 2,000 మంది వైద్యులు, 1,800 నర్సులు, 1,200 మంది ఫిజియోథెరపిస్టులు, 2,000 పైచిలుకు మందుల దుకాణాలను ఈ యాప్‌కు అనుసంధానించామని సహ వ్యవస్థాపకులు మురళి భరద్వాజ్‌ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement