'1950 నుంచి నిర్లక్ష్యం చేశారు' | Cong neglected Assam since 1950s, Prafulla Kumar Mahanta | Sakshi
Sakshi News home page

'1950 నుంచి నిర్లక్ష్యం చేశారు'

Published Tue, Oct 14 2014 4:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'1950 నుంచి నిర్లక్ష్యం చేశారు' - Sakshi

'1950 నుంచి నిర్లక్ష్యం చేశారు'

గౌహతి: ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులకు కాంగ్రెస్ నిర్లక్ష్యపు విధానాలే కారణమని అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్లా కుమార్ మహంతా మండిపడ్డారు. ఈ విధానం 1950 నుంచి కొనసాగుతుండటం వల్లే రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు. అస్సోం గణపరిషత్ (ఏజీపీ) 30 వ వార్షికోత్సవంలో భాగంగా ఆరంభ వేడుకలకు విచ్చేసిన మహంతా.. రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో నేటి పరిస్ధితులకు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కారణమన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అంధఃపాతాళానికి నెట్టేశాయని దుయ్యబట్టారు.

 

ఇన్నాళ్లు కేంద్ర ఏమి అడిగినా ఇస్తుందన్న ముఖ్యమంత్రి తరుణ్ గోగయ్.. వరదల సమయంలో కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లభించడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అస్సాంలో శాంతి యుత వాతావరణంతో పాటు అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీలు ఆసక్తి కనబరచలేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement