తమిళనాడు: తమిళులు దాడులకు గురవుతున్న శ్రీలంకలో జరిగే చోగమ్లో పాల్గొనవద్దని ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ ని డీఎంకే చీఫ్ కరుణానిధి కోరారు. భారత్ నుంచి అణుమాత్ర భాగస్వామ్యాన్నైనా తమిళులు అంగీకరించరని పేర్కొన్నారు. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా పాల్గొంటే మాత్రం కాంగ్రెస్ కు కష్టాలు తప్పవన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని చోగమ్ పాల్గొనకుంటే మంచిదని హితవు పలికారు. కామన్ వెల్త్ సదస్సులో భాగంగా నవంబరు 15-17వ తేదీ వరకూ కొలంబోలో జరిగే చోగమ్ లో ప్రధాని పాల్గొంటారని వార్తల నేపథ్యంలో కరుణ ఈ వ్యాఖ్యలు చేశారు. షిప్పింగ్ మంత్రి జీకే వాసన్ రాజీనామా చేస్తున్నారన్న వార్తలపై ప్రశ్నించగా.. తన వద్ద సమాచారం లేదన్నారు.
చోగమ్ లో మన్మోహన్ హాజరవడానికి అనుమతినిచ్చిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఒక రోజు బంద్ కు పిలుపునివ్వాలని ముస్లిం పార్టీ మనిత్తనేయ మక్కల్ కచ్చి ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేశారు.