CHOGM
-
కామన్వెల్త్ చీఫ్‌గా చార్లెస్
లండన్: కామన్వెల్త్ చీఫ్‌గా ప్రిన్స్ చార్లెస్(69) నియామకానికి 53 కూటమి దేశాల అధినేతలు ఆమోద ముద్ర వేశారు. కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్) సదస్సులో భాగంగా శుక్రవారం విండ్సర్ కోటలో రహస్యంగా జరిగిన భేటీలో చార్లెస్‌ను కామన్వెల్త్ చీఫ్‌గా నియమించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. చోగమ్ ముగింపు సందర్భంగా అధికారిక ప్రకటనలో ఈ విషయం చెప్పారు. చార్లెస్ తన తల్లి క్వీన్ ఎలిజబెత్ నుంచి కామన్వెల్త్ బాధ్యతల్ని అధికారికంగా చేపట్టనున్నారు. ప్రిన్స్ చార్లెస్ చీఫ్ కావాలన్నది తన ఆకాంక్షని, దీన్ని సభ్యులందరూ ఆమోదించాలని ప్రారంభ ఉపన్యాసంలో గురువారం ఎలిజబె™Œ కోరింది. ఎలాంటి ముందస్తు అజెండా లేకుండా విండ్సర్ కోటలో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీసహా 52 దేశాల అధినేతలు పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోస భేటీకి హాజరుకాలేదు. తదుపరి కామన్వెల్త్ చీఫ్‌పై ఏకాభిప్రాయంతో పాటు, కూటమి భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చర్చించారు. ప్రిన్స్ చార్లెస్ ఎంపికపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత్ ముందుగానే ప్రకటించింది. కాగా భారత్ మద్దతు కూడగట్టేందుకు ప్రిన్స్ చార్లెస్ గట్టిగానే కృషి చేశారు. గతేడాది భారత్ పర్యటన సందర్భంగా ప్రధానిని కలిసి లండన్ సదస్సుకు రావాలని వ్యక్తిగతంగా కోరారు. మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్ వద్ద భారతదేశ జాతీయ జెండాను అపవిత్రం చేసిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ‘మేం చర్యలు ఆశిస్తున్నాం. ఈ ఘటనకు పాల్పడిన వారితో పాటు, రెచ్చగొట్టిన వారిపై చర్యలు చేపట్టాలి’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. కామన్వెల్త్ ఫండ్‌కు సాయం రెండింతలు ప్రజాస్వామ్యం బలోపేతం, చట్టబద్ధ పాలన, అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, వాతావరణం, కామన్వెల్త్ దేశాలు ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై చోగమ్ సదస్సులో చర్చించారు. అభివృద్ధి లక్ష్యాలు, వాతావరణ అంశాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి(పశ్చిమ) ఘనశ్యామ్ తెలిపారు. కామన్వెల్త్లో భాగంగా ఉన్న చిన్న దేశాలు, ద్వీపాల్లో సామర్థ్యం పెంచాలని, సాంకేతిక సహకారం కోసం కామన్వెల్త్ ఫండ్‌కు సాయాన్ని రెండింతలు చేస్తామని మోదీ ప్రకటించారన్నారు. భారత్‌కు తిరుగుపయనం: బ్రిటన్ పర్యటన ముగించుకున్న మోదీ శుక్రవారం రాత్రి జర్మనీ చేరుకున్నారు. రాజధాని బెర్లిన్‌లో కొద్ది గంటలు గడిపిన ఆయన జర్మనీ చాన్సలర్ మెర్కెల్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం ఐదురోజుల విదేశీ పర్యటన ముగించి భారత్‌కు బయల్దేరారు. -
ద్వైపాక్షిక చర్చల్లో బిజీ బిజీ
లండన్: కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్)సదస్సులో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ బిజీ బిజీగా గడిపారు. వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అయితే చోగమ్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీతో మోదీ భేటీ కారని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘ఈ సదస్సు కారణంగా వివిధ దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు అవకాశం దొరికింది’ అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియేడ్స్లతో మోదీ సమావేశమయ్యారు. అనంతరం జమైకా, జాంబియా, ఉగాండా, సీషెల్స్, ఫిజీ, సెయింట్ లూసియా, సోలొమాన్ ఐలాండ్స్, కిరిబాతి, అంటింగ్వా–బార్బుడా తదితర దేశాధినేతలతో ప్రధాని చర్చలు జరిపారు. మారిషస్ ప్రధాని జుగ్నౌత్తో ద్వైపాక్షిక సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, సముద్రతీర సహకారం తదితర అంశాలపై చర్చలు జరిగాయి. అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతోనూ మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మనమంతా ఒక్కటే: థెరిసా మే బ్రిటన్ ప్రధాని థెరిసా మే చోగమ్ తొలి సెషన్ (గురువారం నాటి కార్యక్రమాలు) ప్రారంభోపన్యాసం చేశారు. ‘కూటమిలోని దేశాలన్నింటికీ సమానమైన హోదా ఉండటం, ప్రతి ఒక్కరి వాణిని గౌరవించటమే కామన్వెల్త్ బలం. అందుకే అందరికీ మాట్లాడే అవకాశం దక్కుతుంది. నేటి ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటోంది. వీటి పరిష్కారం కోసం మనమంతా ఆలోచన చేయాలి. కామన్వెల్త్ కూటమిగా మన దేశాల్లోని 240 కోట్ల మంది ప్రజలకు.. మేలు చేసేలా పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలి’ అని ఆమె పేర్కొన్నారు. -
కామన్వెల్త్ చీఫ్‌గా ప్రిన్స్ చార్లెస్!
లండన్: కామన్వెల్త్ చీఫ్‌గా తన కొడుకు ప్రిన్స్ చార్లెస్ పేరును క్వీన్ ఎలిజబెత్ ప్రతిపాదించారు. లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశాల(చోగమ్)ను ఆమె గురువారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని మోదీతో పాటు వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 91 ఏళ్ల రాణి ప్రారంభోపన్యాసం చేస్తూ.. ప్రిన్స్ చార్లెస్ తన వారసుడిగా కామన్వెల్త్కు చీఫ్ కావాల న్నది తన ఆకాంక్ష అని.. దీన్ని సభ్యులం దరూ ఆమోదించాలని కోరారు. కామన్వెల్త్ చీఫ్ పదవి వారసత్వంగా సంక్రమించేది కాదు.. రాణి మరణించిన తర్వాత ఆటో మేటిగ్గా ప్రిన్స్ చార్లెస్‌ను ఆ పదవి వరించదు. 53 కామన్వెల్త్ సభ్య దేశాల అధినేతలు శుక్రవారం సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రాజవం శీకుల ప్రభావం నుంచి కామన్వెల్త్ను దూరంగా ఉంచేందుకు ఇదో అవకాశమని.. చీఫ్‌గా వేరేవారిని పెడితే బాగుంటుందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. కామన్వెల్త్ అధినేతగా ప్రిన్స్ చార్లెస్‌ను ఎన్నుకోవాలన్న విషయమై సభ్యులందరిలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది. -
చోగమ్ ను బహిష్కరిద్దాం: తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
కొలంబో: శ్రీలంకలో ఏర్పాటైన కామన్ వెల్త్ ప్రభుత్వాధినేతల (చోగమ్) సమావేశాలను భారత్ బహిష్కరించాలని తమిళ ప్రభుత్వం తీర్మానించింది. లంకలోని తమిళులపై అక్కడి ప్రభుత్వం వివక్ష చూపెడుతున్న నేపథ్యంలో భారత్ చోగమ్ కు దూరంగా ఉండి తన నిరసన తెలియజేయాలని తమిళనాడు అసెంబ్లీ ప్రతిపాదించింది. శ్రీలంకలో సింహాళీలతో పాటు తమిళులకు సమాన హక్కు కల్పించాలని తీర్మానించారు. అంతవరకూ శ్రీలంకలో జరిగే చోగమ్ సదస్సుకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఈ సమావేశాలకు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నా, తన తరఫున విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రాతినిధ్యం వహిస్తారని ప్రధాని మన్మోహన్ సింగ్ రాజపక్సేకు రాసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదేమీ తమిళులకు ఊరటనిచ్చేది కాదని జయలలిత తెలిపారు. ఈ సదస్సును మొత్తంగా బహిష్కరిస్తేనే తమిళుల అండగా ఉన్నట్లని పేర్కొన్నారు. ఈ అంశంపై మెతక వైఖరి ప్రదర్శించుకుండా వెంటనే లంక ప్రభుత్వానికి తెలియజేయాలని జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం విజ్క్షప్తి చేసింది. అసెంబ్లీ సమావేశానికి ముందు శ్రీలంకలో ప్రాణాలు కోల్పోయిన తమిళులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
‘చోగమ్’కు మన్మోహన్ గైర్హాజరు
న్యూఢిల్లీ/కొలంబో: కొలంబోలో ఏర్పాటైన కామన్ వెల్త్ ప్రభుత్వాధినేతల (చోగమ్) సమావేశాలకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు లేఖ రాశారు. కొలంబోలోని భారత దౌత్య కార్యాలయం ఈ లేఖను రాజపక్సకు అందజేసింది. ఈ సమావేశాలకు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నా, తన తరఫున విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రాతినిధ్యం వహిస్తారని ప్రధాని మన్మోహన్ తన లేఖలో పేర్కొన్నారు. ‘చోగమ్’ విషయమై దౌత్యపరమైన ప్రక్రియ పూర్తయిందని విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. రాజపక్సకు ప్రధాని మన్మోహన్ రాసిన లేఖలోని అంశాలను అధికారికంగా వెల్లడించకపోయినా, గైర్హాజరుపై ప్రధాని ఇందులో కారణాలను వివరించలేదని తెలుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డ శ్రీలంకలో ఏర్పాటవుతున్న ‘చోగమ్’ సమావేశాలకు ప్రధాని వెళ్లరాదంటూ తమిళనాడు రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్‌లోని ఒక వర్గం నుంచి డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో, చివరకు ఈ సమావేశాలకు హాజరు కారాదని ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో తలెత్తుతున్న నిరసనల నేపథ్యంలోనే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఖుర్షీద్ చెప్పారు. కొలంబోలో ఈనెల 15-16 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాలకు విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరు కానున్నారు. ప్రధాని మన్మోహన్ ఈ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించుకోవడంపై తమిళనాడు ప్రజలు సంతృప్తి చెందగలరని కేంద్ర మంత్రి నారాయణస్వామి అన్నారు. ఇదిలా ఉండగా, 54 దేశాల ‘చోగమ్’ దేశాధినేతల సమావేశాల కోసం శ్రీలంక ఆదివారం నుంచి ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స కొత్తగా నిర్మించిన సమావేశ మందిరంలో యువజన వేదికను ప్రారంభించారు. కామన్వెల్త్ సభ్యదేశాలు కాని చైనా, అమెరికా, జపాన్, బ్రెజిల్ ప్రతినిధులు కూడా కామన్వెల్త్ బిజినెస్ ఫోరంలో పాల్గొననున్నారు. -
గైర్హాజరుతో సాధించేదేమీ ఉండదు:‘చోగమ్’పై బ్రిటన్
లండన్: కొలంబోలో జరగనున్న ‘చోగమ్’ సదస్సుకు గైర్హాజరు కావడం ద్వారా సాధించేదేమీ లేదని, దానివల్ల శ్రీలంకలో సానుకూల మార్పులేవీ రాబోవని బ్రిటిష్ విదేశాంగ మంత్రి విలియమ్ హేగ్ ఆదివారం వ్యాఖ్యానించారు. కాగా, ఈ సమావేశాల్లో శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సను తీవ్రంగా ప్రశ్నించనున్నానని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పారు. శ్రీలంక యుద్ధనేరాలపై చానల్-4 ప్రసారం చేసిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలను తాను చూశానని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, ‘చోగమ్’ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్, మిగిలిన దేశాల ప్రభుత్వాధినేతలు కూడా ఈ సమావేశాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీనిపై బీబీసీతో మాట్లాడిన హేగ్, శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనల దృష్ట్యా ‘చోగమ్’ బహిష్కరణ పిలుపును అర్థం చేసుకోవచ్చన్నారు. అయితే, తాము ఈ సమావేశాలను బహిష్కరించబోవడం లేదని స్పష్టం చేశారు. గైర్హాజరు వల్ల ‘కామన్వెల్త్’ స్ఫూర్తి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని, దాని వల్ల శ్రీలంకలో సానుకూలమైన మార్పులు వచ్చే అవకాశాలు కూడా లేవని అన్నారు. -
డిసెంబర్లో మళ్లీ సమన్వయ భేటీ హైదరాబాద్‌లో
-
అఖిలపక్షాన్ని స్వాగతిస్తున్న అధికార పార్టీ
-
ప్రధాని చోగమ్‌లో పాల్గొంటే కష్టాలు తప్పవు:కరుణానిధి
తమిళనాడు: తమిళులు దాడులకు గురవుతున్న శ్రీలంకలో జరిగే చోగమ్‌లో పాల్గొనవద్దని ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ ని డీఎంకే చీఫ్ కరుణానిధి కోరారు. భారత్ నుంచి అణుమాత్ర భాగస్వామ్యాన్నైనా తమిళులు అంగీకరించరని పేర్కొన్నారు. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా పాల్గొంటే మాత్రం కాంగ్రెస్ కు కష్టాలు తప్పవన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని చోగమ్ పాల్గొనకుంటే మంచిదని హితవు పలికారు. కామన్ వెల్త్ సదస్సులో భాగంగా నవంబరు 15-17వ తేదీ వరకూ కొలంబోలో జరిగే చోగమ్ లో ప్రధాని పాల్గొంటారని వార్తల నేపథ్యంలో కరుణ ఈ వ్యాఖ్యలు చేశారు. షిప్పింగ్ మంత్రి జీకే వాసన్ రాజీనామా చేస్తున్నారన్న వార్తలపై ప్రశ్నించగా.. తన వద్ద సమాచారం లేదన్నారు. చోగమ్ లో మన్మోహన్ హాజరవడానికి అనుమతినిచ్చిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఒక రోజు బంద్ కు పిలుపునివ్వాలని ముస్లిం పార్టీ మనిత్తనేయ మక్కల్ కచ్చి ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేశారు.