ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎలిజబెత్ రాణి
లండన్: కామన్వెల్త్ చీఫ్‌గా తన కొడుకు ప్రిన్స్ చార్లెస్ పేరును క్వీన్ ఎలిజబెత్ ప్రతిపాదించారు. లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశాల(చోగమ్)ను ఆమె గురువారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని మోదీతో పాటు వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 91 ఏళ్ల రాణి ప్రారంభోపన్యాసం చేస్తూ.. ప్రిన్స్ చార్లెస్ తన వారసుడిగా కామన్వెల్త్‌కు చీఫ్ కావాల న్నది తన ఆకాంక్ష అని.. దీన్ని సభ్యులం దరూ ఆమోదించాలని కోరారు.
కామన్వెల్త్ చీఫ్ పదవి వారసత్వంగా సంక్రమించేది కాదు.. రాణి మరణించిన తర్వాత ఆటో మేటిగ్గా ప్రిన్స్ చార్లెస్‌ను ఆ పదవి వరించదు. 53 కామన్వెల్త్ సభ్య దేశాల అధినేతలు శుక్రవారం సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రాజవం శీకుల ప్రభావం నుంచి కామన్వెల్త్‌ను దూరంగా ఉంచేందుకు ఇదో అవకాశమని.. చీఫ్‌గా వేరేవారిని పెడితే బాగుంటుందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. కామన్వెల్త్ అధినేతగా ప్రిన్స్ చార్లెస్‌ను ఎన్నుకోవాలన్న విషయమై సభ్యులందరిలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment