లండన్: కొలంబోలో జరగనున్న ‘చోగమ్’ సదస్సుకు గైర్హాజరు కావడం ద్వారా సాధించేదేమీ లేదని, దానివల్ల శ్రీలంకలో సానుకూల మార్పులేవీ రాబోవని బ్రిటిష్ విదేశాంగ మంత్రి విలియమ్ హేగ్ ఆదివారం వ్యాఖ్యానించారు. కాగా, ఈ సమావేశాల్లో శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సను తీవ్రంగా ప్రశ్నించనున్నానని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పారు. శ్రీలంక యుద్ధనేరాలపై చానల్-4 ప్రసారం చేసిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలను తాను చూశానని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, ‘చోగమ్’ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్, మిగిలిన దేశాల ప్రభుత్వాధినేతలు కూడా ఈ సమావేశాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీనిపై బీబీసీతో మాట్లాడిన హేగ్, శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనల దృష్ట్యా ‘చోగమ్’ బహిష్కరణ పిలుపును అర్థం చేసుకోవచ్చన్నారు. అయితే, తాము ఈ సమావేశాలను బహిష్కరించబోవడం లేదని స్పష్టం చేశారు. గైర్హాజరు వల్ల ‘కామన్‌వెల్త్’ స్ఫూర్తి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని, దాని వల్ల శ్రీలంకలో సానుకూలమైన మార్పులు వచ్చే అవకాశాలు కూడా లేవని అన్నారు.
గైర్హాజరుతో సాధించేదేమీ ఉండదు:‘చోగమ్’పై బ్రిటన్
Published Sun, Nov 10 2013 10:13 PM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
Advertisement
Advertisement