పవర్ కట్ పుణ్యమాని.. విడాకులు! | copule get divorced because of power cuts in uttar pradesh | Sakshi
Sakshi News home page

పవర్ కట్ పుణ్యమాని.. విడాకులు!

Published Sat, Apr 18 2015 11:39 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

పవర్ కట్ పుణ్యమాని.. విడాకులు! - Sakshi

పవర్ కట్ పుణ్యమాని.. విడాకులు!

పవర్ కట్ కారణంగా ఓ జంట విడిపోయింది. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతిరోజూ పవర్ కట్ అక్కడ సర్వసాధారణం. రుక్సానా అలియాస్ బబ్లీ (32) అనే మహిళకు ఏడేళ్ల క్రితం ఖాదిర్ అనే వ్యక్తితో పెళ్లయింది. అయితే రోజూ రాత్రిపూట కరెంటు పోతోంది. క్యాండిల్ వెలుగులోనే భోజనం చేద్దామని ఆమె అడిగితే.. భర్త మాత్రం ఎందుకు, కరెంటు వచ్చాక తిందాం అనేవాడు. కరెంటు వచ్చేవరకు మేలుకుని ఉండి, తనకు వడ్డించాలని బలవంతపెట్టేవాడని, తాను కాదంటే కొట్టేవాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

అయితే ఖాదిర్ మాత్రం భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడని, పిల్లలతో కూడా బాగుండేవాడని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. వాళ్లకు ముగ్గురు పిల్లలున్నారు. ఎంత చెప్పినా ఖాదిర్ తన భోజనం అలవాటును మాత్రం మార్చుకోకపోవడంతో.. బబ్లీ అతడి నుంచి విడిపోయి సూరత్లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఖాదిర్ మాత్రం తనపై మోపిన ఆరోపణలను ఖండించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement