మరింతగా పెరగనున్న వర్షాభావం
న్యూఢిల్లీ: దేశంలో ఖరీఫ్ పంటలకు కష్టకాలం వచ్చింది. నైరుతి రుతుపవనాల ప్రభావం లేక ఇప్పటికే వర్షాలు సరిగా కురవలేదు. ఇక ముందూ వర్షాలు సరిగా కురిసే అవకాశం తక్కువని... దేశవ్యాప్తంగా వర్షాభావం లోటు 12 శాతం వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు 10 శాతం లోటు నమోదైందని... ఆగస్టు, సెప్టెంబర్‌లలో 16 శాతం వరకు వర్షపాతం లోటు ఉండవచ్చని ఆ శాఖ డెరైక్టర్ జనరల్ లక్ష్మన్‌సింగ్ రాథోడ్ చెప్పారు. మరోవైపు హిమాలయ సానువుల్లో అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అయినా మొత్తంగా వర్షపాతం లోటు కొనసాగుతుందని వెల్లడించారు.
ఈ వర్షాభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్, యూపీల్లో ఖరీఫ్ పంటల దిగుబడి తగ్గే ప్రమాదముందని అంచనా. ఇప్పటివరకు తెలంగాణలో 23 శాతం వర్షపాతం లోటు నమోదుకాగా, ఏపీలోని రాయలసీమ, తూర్పు ఉత్తరప్రదేశ్‌ల్లో 36 శాతం వర్షాభావం నెలకొంది.
ఖరీఫ్‌కు కష్టకాలమే!
Published Tue, Aug 18 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM
Advertisement
Advertisement