the southwest monsoon
-
కార్తెలు కరిగిపోతున్నాయి..!
కానరాని వర్షం జాడ.. ► అదను దాటుతోందని అన్నదాత ఆవేదన ► బోసిపోతున్న ప్రాజెక్టులు, చెరువులు ► మరో పది రోజులు వర్షాలు లేకుంటే.. ► పత్తి, మొక్కజొన్న, సోయాకు దెబ్బ ► వరి సాగుకు అనుకూలించని వర్షాలు సాక్షి నెట్వర్క్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి నెల రోజులవుతున్నాయి. మరో పక్క కార్తెలు కరిగిపోతున్నాయి. తొలకరిలో మురిపించిన వర్షాలు తర్వాత ముఖం చాటేయడంతో రైతు పరిస్థితి దిక్కుతోచకుంది. ఇప్పటికే భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించాల్సి ఉంది. కొత్తనీటితో జలాశయాలు నీటి కుండలను తల పించాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో అధిక వర్షపాతం, 15 జిల్లాల్లో సాధా రణ వర్షపాతం నమోదు కాగా, జగి త్యాల, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో లోటు వర్షపాత మున్నట్లు తాజాగా వ్యవసాయ శాఖ వెల్లడిం చింది. పది శాతం చెరువుల్లో కూడా కనీస నీటి నిల్వలు లేవు. ఇప్పటికే నార్లు పోసు కున్న అదను దాటుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పది రోజుల్లో వర్షాలు పడ కుంటే కొద్దిపాటిగా సాగు చేసిన ఆరు తడి పంటలు దెబ్బతినే ప్రమాదముంది. జిల్లాలో ఇదీ పరిస్థితి... ఠి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల కింద సుమారు 2,67,780 ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీల్లోనే ఉన్నా యి. ఒక్క కడెం ప్రాజెక్టు గరిష్ట మట్టానికి పది అడుగులుండటంతో 5 రోజులుగా నారుమ డుల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2,579 చెరువుల కింద 2,68,000 ఎకరాల ఆయకట్టు ఉండగా, పది శాతం చెరువుల్లోకి కూడా నీళ్లు రాలేదు. అత్య ధికంగా పత్తి, సోయా, మొక్కజొన్న వేశారు. ♦ మహబూబ్‌నగర్ జిల్లాలో రైతాంగం జూలై చివర్లో వరినాట్లు వేసుకుంటారు. వర్షాధా రంగా చెరువుల కింద పంటలు పండించు కుంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,332 కుంటలు, చెరువులు ఉండగా, 86 చెరువులు మాత్రమే నిండాయి. 5,448 చెరువులు 25 శాతం, 559 చెరువులు 50 శాతం, 192 చెరువుల్లో 75 శాతం నీళ్లు చేరాయి. ♦ పాత నల్లగొండ జిల్లాలో 4,652 చెరువులు ఉండగా.. 60 చెరువులు పూర్తిగా నిండాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోకి వరదనీరు రాలేదు. 4,27,459 హెక్టార్లకుగాను 1,47,122 హెక్టార్లలో మాత్రమే వరి, పత్తి, జొన్న, మొక్కజొన్న, కందులు, పెసర్లు, వేరుశనగ, 1,00,907 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. ♦ సంగారెడ్డి జిల్లా పరిధిలో 1,279 చెరువులకు గాను.. ఏ ఒక్క చెరువులోనూ కనీస స్థాయిలో నీరు చేరలేదు. ఖరీఫ్‌లో 5.19 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 3.04 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది 51వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని చెబుతున్నా 35 వేల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశముంది. బోరు బావుల కింద నారు పోసిన రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. పత్తి 1.82 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఇప్పటికే వర్షాలు లేక మొక్కలు అక్కడక్కడా వడలిపోతున్నాయి. ♦ మెదక్ జిల్లాలో 2,240 చెరువులు వుండగా ఒక్కటీ పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో పత్తి, మొక్కజొన్న వంటి వర్షాధార, ఆరుతడి పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. బోరు బావుల కింద వరినారు పోసిన రైతులు.. చెరువులు, కుంటల్లో నీరులేక నాట్లకు మొగ్గు చూపడం లేదు. ఈ సీజన్లో 2.31 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం కాగా, 88,984 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ♦ సిద్దిపేట జిల్లాలో 5.79 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4.20 లక్షల ఎకరాల్లోనే పంటలు వేసి వుంటారని ప్రాథమిక అంచనా. చెరువులు, కుంటల్లో ఎక్కడా పూర్తి స్థాయిలో నీరు చేరకపోవడంతో వర్షాధారం, బోరుబావుల ఆధారంగానే రైతులు పంటలు వేశారు. ♦ వికారాబాద్ జిల్లాలో మొత్తం 1,907 చెరువులు ఉండగా, 1.73 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి 22 వేల హెక్టార్లలో వరి పంట సాగు అవుతోంది. బోర్లకింద ఇప్పటికే 30 శాతం రైతులు నారుమళ్లు పోసుకుంటున్నారు. ♦ నిజామాబాద్ జిల్లాలో 1,241 చెరువులు ఉన్నాయి. వీటిలో సుమారు 600 చెరువుల్లో నీటిమట్టం సగం కూడా లేదు. కొన్ని చిన్న చెరువులు, కుంటల్లో అయితే సుమారు 30 శాతానికి నీటి మట్టం పడిపోయిందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.34 టీఎంసీలు మాత్రమే నీటి మట్టం ఉంది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 4.32 లక్షల ఎకరాలకుగాను ప్రస్తుతం 2.44 లక్షల ఎకరాలు మాత్రమే సాగైంది. ♦ కామారెడ్డి జిల్లాలో 1,988 చెరువులు, కుంట లు ఉన్నాయి. ఏ ఒక్కదానిలో ఇప్పటి దాకా చుక్కనీరు చేరలేదు. జిల్లాలో 1,47,635 హెక్టార్లలో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇప్పటి వరకు 1,10,917 హెక్టార్లలో విత్తనాలు వేశారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన కొమ్ము రాజం, గట్టమ్మ దంపతులు వరిసాగు కోసం పొలాన్ని సిద్ధం చేసుకున్నారు. తొలకరికి పోసుకున్న నారుమడి వర్షాల్లేక ఎండిపోయే దశకు చేరుకుంది. దీంతో ఎడ్లబండిపై డ్రమ్ములతో సమీపంలో బోర్లవద్ద నుంచి నీళ్లు తెచ్చి బిందెలతో నారుమడిని తడుపుతున్నారు. – భీమారం(చెన్నూర్) -
దోబూచులాడుతున్న నైరుతి..
రాష్ట్రంలోకి రావడానికి మరో నాలుగైదు రోజులు సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడానికి దోబూచులాడుతున్నాయి. వారం కిందట కేరళను తాకిన ‘నైరుతి’ రాష్ట్రంలోకి రావడానికి ఆలస్యం చేస్తోంది. వాస్తవానికి బుధవారం నాటికల్లా రాష్ట్రంలోకి వస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని తాజాగా ప్రకటించింది. వాతావరణంలో గంట గంటకూ వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయని, దాంతో రుతు పవనాలు ఒక్కోసారి వేగంగా ముందుకు కదులుతాయని, ఒక్కోసారి స్థిరంగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడితే రుతు పవనాలు వేగంగా ప్రవేశిస్తాయని చెబుతున్నారు. గతేడాది తెలంగాణలోకి రుతు పవనాలు జూన్ 13వ తేదీనే ప్రవేశించాయి. ఈ ఏడాది 15న వస్తాయని అనుకున్నా రాలేదు. ఎంత ఆలస్యమైనా జులై నుంచి మాత్రం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. పినపాక, మణుగూరుల్లో భారీ వర్షం.. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా పినపాకలో 7, మణుగూరులో 6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలోనే అనేకచోట్ల, వరంగల్ జిల్లాలో కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. మంగళవారం రామగుండంలో అత్యధికంగా 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 40.8, హన్మకొండ, నిజామాబాద్‌ల్లో 39.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. ఖమ్మం లో 38.6, హైదరాబాద్‌లో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
ఇక వానలే వానలు!
మూడు రోజుల్లో భారీ వర్షాలు ఇప్పుడే విత్తుకోవద్దు.. దుక్కి సిద్ధం చేసుకోండి.. రైతులకు వ్యవసాయ శాఖ సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించనప్పటికీ జోరుగా వానలు కురవనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక మరో నాలుగు రోజుల్లో రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. అయితే రుతు పవనాలతో కూడిన వానలు.. అల్ప పీడనం ప్రభావంతో కురుస్తున్న వానలకు తేడాలను రైతులు గుర్తించాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం అల్ప పీడన ప్రభావంతో వానలు కురుస్తున్నందున వాటిని నమ్ముకుని విత్తనాలు విత్తుకోవద్దని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో రైతులను వ్యవసాయ శాఖ కోరింది. కేవలం దుక్కి సిద్ధం చేసుకోవాలని సూచించింది. అల్పపీడన ప్రభావంతో కురిసే వానలు ఉన్నట్టుండి మాయమవుతాయి. వాటిని నమ్మి విత్తుకుంటే.. మొలకెత్తే అనువైన వాతావరణం లేక రైతులు నష్టపోవాల్సి ఉంటుంది. రుతుపవనాలు తాకిన తర్వాత తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ., బరువు నేలల్లో 60 నుంచి 75 మి.మీ. మేర వర్షపాతం నమోదైన అనంతరం విత్తుకునేందుకు అనువైన వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 15 నుంచి 20 సెం.మీ. మేర నేల తడిస్తేనే వర్షాధార పంటలైన సోయాచిక్కుడు, జొన్న, మొక్కజొన్న, కంది, పెసరతోపాటు పత్తి పంటలకు అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక వరిలో సోనా (ఆర్ఎన్ఆర్ 15048) రకం నారు వేసుకునేందుకు జూన్ మాసం అనుకూలంగా ఉండదని, కేవలం జులైలోనే నారు పోసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గురువారం నిజామాబాద్, హైదరాబాద్, భద్రాచలం తదితర ప్రాంతాల్లో వానలు కురిశాయి. ఏపీలోకి నైరుతి ప్రవేశం సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు గురువారం ఏపీలోకి ప్రవేశించాయి. బుధవారం కేరళను తాకిన ఈ రుతుపవనాలు 24 గంటల్లోనే ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలను తాకాయి. రానున్న 24 గంటల్లో ఇవి కోస్తాంధ్ర, రాయలసీమల్లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. -
వరికి ఊపిరి
జిల్లాలో భారీవర్షం గూడూరులో అత్యధికం 128.2 మిల్లీమీటర్లు రైతులకు కొంత ఊరట మచిలీపట్నం : తూర్పుకృష్ణాలో బుధవారం తెల్లవారుజాము ఒంటి గంట నుంచి 5గంటల వరకు భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా గూడూరు మండలంలో 128.2 మిల్లీమీటర్లు, మచిలీపట్నంలో 103.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా ఉంగుటూరు మండలం 2.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 19.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా తూర్పుకృష్ణాలో భారీ వర్షం కురవడంతో వరి పొలాల్లో నీరు చేరింది. ఇంత కాలంగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న వరి పైరుకు కొంతమేర ఊపిరి పోసినట్లయ్యింది. రైతుల్లో ఆనందం.. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉండగా ఇంత వరకు కాలువలకు సాగునీరు విడుదల చేయలేదు. వర్షాధారంగా, డ్రెయిన్లలోని నీటి ఆధారంగా 4.64 లక్షల ఎకరాల్లో ఎన్నో ఆశలతో వరిసాగు చేశారు. మరో 1.75 లక్షల ఎకరాల్లో వరిసాగు నిలిచిపోయింది. సెప్టెంబరు 20వ తేదీ నుంచి కాలువలను పూర్తిస్థాయిలో కట్టివేశారు. సాగునీటి ఎద్దడి తీవ్ర తరం కావడంతో మంత్రి కామినేని శ్రీనివాస్, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఖరీఫ్‌కు కష్టకాలమే!
మరింతగా పెరగనున్న వర్షాభావం న్యూఢిల్లీ: దేశంలో ఖరీఫ్ పంటలకు కష్టకాలం వచ్చింది. నైరుతి రుతుపవనాల ప్రభావం లేక ఇప్పటికే వర్షాలు సరిగా కురవలేదు. ఇక ముందూ వర్షాలు సరిగా కురిసే అవకాశం తక్కువని... దేశవ్యాప్తంగా వర్షాభావం లోటు 12 శాతం వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు 10 శాతం లోటు నమోదైందని... ఆగస్టు, సెప్టెంబర్లలో 16 శాతం వరకు వర్షపాతం లోటు ఉండవచ్చని ఆ శాఖ డెరైక్టర్ జనరల్ లక్ష్మన్‌సింగ్ రాథోడ్ చెప్పారు. మరోవైపు హిమాలయ సానువుల్లో అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అయినా మొత్తంగా వర్షపాతం లోటు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ వర్షాభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్, యూపీల్లో ఖరీఫ్ పంటల దిగుబడి తగ్గే ప్రమాదముందని అంచనా. ఇప్పటివరకు తెలంగాణలో 23 శాతం వర్షపాతం లోటు నమోదుకాగా, ఏపీలోని రాయలసీమ, తూర్పు ఉత్తరప్రదేశ్‌ల్లో 36 శాతం వర్షాభావం నెలకొంది. -
రాష్ట్రానికి కరువు దెబ్బ
తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొన్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడి 58 శాతానికి పడిపోయిన సాగు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కరువు కబళిస్తోంది.. ఇప్పటికే ఖరీఫ్‌లో నైరుతి రుతుపవనాలు దెబ్బతీయగా.. ఇప్పుడు రబీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 60 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా.. పంటల సాగు 58 శాతానికి తగ్గిపోయింది. భూగర్భ జలాలు కూడా సాధారణంతో పోలిస్తే మూడు మీటర్లకు పైగా లోతులోకి పడిపోయాయి. దీంతో ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని వ్యవసాయశాఖ రైతులకు సూచించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని వారం వారం విడుదల చేసే నివేదికలో భాగంగా వ్యవసాయశాఖ వెల్లడించింది. రబీలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి బుధవారం నాటికి సాధారణంగా 122.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 49.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. మెదక్‌లో రబీ సాగు 21 శాతమే.. రాష్ట్రంలో ఈ ఏడాది రబీ సాగు బాగా తగ్గిపోయింది. సాధారణంగా రబీ సీజన్లో మొత్తంగా 13.09 లక్షల హెక్టార్లలో సాగు జరగాలి. అందులో ప్రస్తుత సమయానికి 4.68 లక్షల హెక్టార్లలో సాగు ప్రారంభంకావాల్సి ఉండగా... 2.72 లక్షల హెక్టార్లలోనే (58%) పంటలు వేశారు. జిల్లాల వారీగా చేస్తే మెదక్‌లో అత్యంత తక్కువగా 21 శాతమే రబీ సాగు చేపట్టారు. ఇక నల్లగొండ జిల్లాలో 30 శాతం, రంగారెడ్డిలో 48 శాతం, ఆదిలాబాద్‌లో 50 శాతం, ఖమ్మంలో 52 శాతం, నిజామాబాద్ జిల్లాలో 57 శాతం పంటల సాగు జరిగింది. -
కష్టకాలం
సాక్షి, ఖమ్మం: నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో ఆశతో ఖరీఫ్ సాగు మొదలుపెట్టిన రైతన్నకు ఆ తర్వాత నిరాశేమిగిలింది. విత్తునాటడానికే చినుకులు రాలకపోవడంతో అప్పుడుప్పుడు కురిసే జల్లులతోనే 3,31,494 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో సాగు చేసిన వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఇల్లెందు, గుండాల, బయ్యారం, టేకులపల్లి, కారేపల్లి, మధిర, పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లో మొక్కజొన్న ఎండిపోయింది. విద్యుత్ కోతలతో తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, బయ్యారం, గార్ల, కామేపల్లి, కారేపల్లి, టేకులపల్లి, గుండాల, బూర్గంపాడు, కొత్తగూడెం, ముల్కలపల్లి, పాల్వంచ, చండ్రుగొండ తదితర మండలాల్లో బోర్లు, బావుల కింద సాగు చేసిన వరి చేతికి అందే దశలో ఎండిపోతోంది. ఆయా మండలాల్లో పత్తి పంట కూడా వాడిపోవడంతో దిగుబడి తగ్గింది. జిల్లాలో సాగు చేసిన మిరప తోటలు ఆశాజనకంగా లేవు. వర్షాభావంతో అన్ని పంటల దిగుబడులు తగ్గాయి. అడుగంటిన భూగర్భ జలాలు తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి. భూగర్భ జలవనరుల శాఖ నిబంధనల ప్రకారం ఖరీఫ్, రబీ సీజన్లో 2 నుంచి 3 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోతే అంతగా పంటలు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. కానీ ఈ స్థాయే ఖరీఫ్‌లో దాటితే రబీలో మరింత తీవ్రతరమై నీటి కష్టాలు ఎదురవుతాయి. బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర (వీఎంల)లో గత నెలలో అత్యధికంగా 6.33 మీటర్లకు నీటిమట్టం పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది. దళారీ చేతిలో రైతు దగా అరకొరగా చేతికి అందిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం రైతును మరింత కుంగదీస్తోంది. కనీసం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా రైతుకు దక్కపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వం 10 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం ఖమ్మంలో ఒక్క కేంద్రాన్ని మాత్రమే తెరిచారు. ఈ కేంద్రంలోనూ వ్యాపారుల దందానే కొనుసాగుతండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిగతా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మద్దతు ధర రూ.4,050 అయితే దళారులు రూ.3వేల నుంచి రూ. 3,500 వరకే పెడుతున్నారు. రుణమాఫీకి ఎదురుచూపులు.. ఈ ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.1,400 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో రూ.4.81 కోట్లు మాత్రమే కొత్తగా రైతులకు రుణాలు ఇచ్చారు. రూ.724 కోట్లు రెన్యూవల్స్ చూపించారు. జిల్లా వ్యాప్తంగా రూ. 1,700 కోట్లు రుణమాఫీ కావాలి. ఇప్పటి వరకు 25 శాతం రుణమాఫీ కింద జిల్లాకు రూ.427.85 కోట్లను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో రూ.285 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. నూతన రుణాలు, రుణమాఫీ అంటూ కాగితాల్లోనే ప్రభుత్వం అంకెల గారిడి చేసింది. కొత్తగా రుణాలు ఇవ్వకపోవడం, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బలవన్మరణం.. జిల్లాలో 12 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ప్రభుత్వ రికార్డుల్లో ఏ ఒక్కటీ నమోదుకాకపోవడం గమనార్హం. మధిర మండలం రొంపిమళ్ల గ్రామానికి చెందిన మొగిలి నాగేశ్వరరావు (30) పత్తి సాగుతో అప్పులపాలై పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పినపాక నియోజకవర్గంలో ఈ సీజన్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వాపురం మండంలోని అమెర్ధ పంచాయతీ చండ్రలబోడు గ్రామానికి చెందిన ఎనిక తిరుపతి(40), గుండాల మండలం దామర గూడెం వాసి పాయం పాపయ్య(30), నడిమిగూడెంకు చెందిన పాయం రాంబాబు(22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నేలకొండపల్లి మండలం ఆరేగూడెం గ్రామ రైతు తమ్మినేని వెంకటేశ్వరరావు (40), తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం శివారు అజ్మీరాతండాకు చెందిన భూక్యా సామ్యా (35), ఏన్కూరు మండలం రాయమాధారానికి చెందిన జబ్బ శ్రీనివాసరావు (30), జూలూరుపాడు మండలం భీమ్లాతండాకు చెందిన బాదావత్ వెంకట్రామ్(45), పాల్వంచ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన తాటి శ్రీను(39) బలవన్మరణానికి పాల్పడ్డారు. వర్షాభావం వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని 32 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఎర్రుపాలెం, మధిర, బోనకల్, వైరా, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ఖమ్మంఅర్బన్, ఏన్కూరు, తల్లాడ, వేంసూరు, దమ్మపేట, ముల్కలపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం, సింగరేణి, ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, అశ్వాపురం, గుండాల, చర్ల, వేలేరుపాడు, కొణిజర్ల మండలాలను కరువు ప్రాంతాలుగా పేర్కొన్నారు. -
కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం : రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక, మహారాష్ట్ర తీరప్రాంతం వద్ద అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇది తీరంవైపు పయనిస్తూ బలహీనపడుతోందని, ఈ సమయంలో దీని ప్రభావం పరిసర ప్రాంతాలపై బాగా ఉం టుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో రాయలసీమ, కోస్తాం ధ్ర, తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్ష సూచన: మంగళవారం కోస్తాంధ్రలోని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, బుధవారం కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు: రాయలసీమ మినహా కోస్తాంధ్ర, తెలంగాణలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. సోమవారం తునిలో గరిష్టంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఒంగోలు 37.3, కాకినాడ 35.8, నెల్లూరు 35.4, గన్నవరం 35.2, నిజామాబాద్ 35.1, హైదరాబాద్, రామగుండంలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. -
దుర్భిక్షం
కనిపించని నైరుతి జాడ జలశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు మలెనాడులోనూ ఇదే పరిస్థితి ‘తుంగభద్ర’కు నీటి విడుదల బంద్ సాక్షి ప్రతినిధి/బెంగళూరు/ శివమొగ్గ : నైరుతి రుతు పవనాల జాడ లేకపోవడంతో రాష్ట్రంలో క్రమంగా కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు శర వేగంగా తగ్గిపోతున్నాయి. ఈ నెల తొలి వారంలోనే రాష్ర్టంలోకి ప్రవేశించాల్సిన నైరుతి రుతు పవనాలు ఇప్పటి వరకు పత్తా లేకుండా పోయాయి. గత వుూడు వారాల్లో సగటు వర్షపాతం నమోదు కాకపోవడంతో ఈసారి కూడా కరువు తప్పదేమోననే ఆందోళన నెలకొంటోంది. గత ఏడాది కరువు నెలకొన్నా తొలకరి వర్షాలు బ్రహ్మాండంగా ప్రారంభమయ్యాయి. కుంటలు, చెరువులకు పెద్దగా నీరు రానప్పటికీ, జలాశయాలు నిండాయి. ఎప్పుడూ మంచి వర్షాలు పడే మలెనాడులో కూడా ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో బలహీనంగా ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువే. కొన్ని చోట్ల వేసిన విత్తనాలు మొలకెత్తక పోగా, మరి కొన్ని భూమిలో తగినంత తేమ శాతం లేకపోవ డంతో విత్తనాలే వేయలేదు. దీంతో రైతుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు నెలకొంటున్నాయి. జులై తొలి వారంలో వర్షాలు పడే అవకాశాలున్నప్పటికీ, ఉత్తర కర్ణాటకలో వర్షాభావం నెలకొనవచ్చని వాతావ రణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద జులైలో కూడా సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఆగస్టులో మాత్రం ఆశాజనకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈలోగా ఖరీఫ్ పంటలకు బాలారిష్టాలు తప్పవని, తద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా తగ్గవ చ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా రైతులు జూన్‌లో భూములను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటారు. జులైలో విత్తన కార్యక్రమం ఉంటుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 145 మి.మీ. సగటు వర్షపాతం కాగా కేవలం 109 మి.మీ. మాత్రమే నమోదైంది. తుంగభద్రకు నీటి నిలిపివేత మలెనాడులో మొన్నటి వరకు బాగా పడిన వర్షాలు రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయాయి. వేసవిలో లాగా ఎండలు మండిపోతున్నాయి. దరిమిలా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శివమొగ్గ తాలూకాలోని తుంగా జలాశయం నుంచి హొస్పేటలోని తుంగభద్ర డ్యాంకు నీటి విడుదలను ఆపి వేశారు. జలాశయానికి ఉన్న అన్ని క్రస్ట్ గేట్లను బుధవారం మూసివేశారు. కరువు ఛాయలు అలుముకుంటాయనే ఆందోళనతో జిల్లాలో వర్షాల కోసం రుద్రాభిషేకాలు, గణపతి హోమాలను నిర్వహిస్తున్నారు.