మైనర్లపై వరుస అత్యాచారాలు... నిందితుడు అరెస్ట్ | Delhi serial rapist arrested | Sakshi
Sakshi News home page

మైనర్లపై వరుస అత్యాచారాలు... నిందితుడు అరెస్ట్

Published Wed, Dec 25 2013 8:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

Delhi serial rapist arrested

మైనర్లపై వరుస అత్యాచారాలకు పాల్పడుతు పోలీసులు కళ్లుకప్పి తిరుగుతున్న నిందితుడు ఆజాద్ ఖాన్ (27)ను  అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి పి.కరుణాకరన్ వెల్లడించారు. బీహార్లోని నిందితుడి స్వగ్రామంలో అతడిని న్యూఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు వివరించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... తుగ్లకబాద్లో భార్యతో కలసి ఆజాద్ ఖాన్ నివసిస్తున్నారు. స్థానిక కంపెనీలో అతడు కార్మికుడుగా పని చేసేవాడని, ఆ సమయంలో స్థానిక బాలికలకు తినుబండారాల ఆశ చూపి, వారిని మాటలతో మభ్యపెట్టివాడని పోలీసులు తెలిపారు.

 

ఆ క్రమంలో బాలికలను తుగ్లక్బాద్ అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి వారిపై అత్యాచారం జరిపేవాడని పోలీసులు చెప్పారు. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్, డిసెంబర్ మాసాలలో వరుసగా ముగ్గురు బాలికల అతడు అత్యాచారం చేశాడని పోలీసులు వివరించారు. దీంతో అయా బాలికల తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు ఏడు నెలలుగా నిందితుడు ఆజాద్ ఖాన్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎట్టకేలకు గత వారం నిందితుడి స్వగ్రామంలో అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement