న్యూఢిల్లీ: దాదాపు నాలుగు నెలల తర్వాత మరోసారి చమురు ధరలు పెరిగాయి. ఒక లీటరు డీజిల్ ధరను 50 పైసలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. కాగా, పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గడిచిన నాలుగు దఫాల ధరల మార్పుల్లో డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.