- ప్రతిపక్ష నేత మైకుకే ఇబ్బంది
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల తొలిరోజు సమావేశాల్లో మైకులు ప్రత్యేకించి విపక్షం వైపున్నవి మొరాయించడంతో ప్రతి పక్ష వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మైకులు ఎందుకు మొరాయిస్తున్నాయో పరీ క్షించి, బాగు చేయమని ఆదేశించాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాదరావే ‘మీలో ఎవరో వైరు తెంచుకున్నారని’ వ్యాఖ్యానించడం గమనా ర్హం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళులర్పించే సమయంలో జగన్ తొలిసారి మాట్లాడినప్పుడు బాగానే ఉన్న మైకు ఆ తర్వాత మూగబోయింది. మైకు పని చేయడం లేదని గమనించిన సిబ్బంది.. జేబుకు పెట్టుకునే మైక్రోఫోన్ తెచ్చి అమర్చారు. ఈ దశలో జగన్ ‘శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా మాకు మైకులు రావు. వాళ్లకు(అధికార పక్షానికి) మాత్రం వస్తాయి. గొప్ప మేనేజ్‌మెంట్ జరుగుతోంది’ అని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు, వైఎస్సార్‌సీపీ సభ్యుడు సుజయ్ కృష్ణ రంగారావు ముందున్న మైకులు పని చేయలేదు. ఈ దశలో స్పీకర్ ‘వైరు ఎవరో కట్ చేసుకున్నట్టున్నారు’ అని వ్యాఖ్యానించారు. పుష్కరాల మృతులకు సంతాపం తెలిపే తీర్మానం చర్చ సందర్భంలోనూ ప్రతిపక్ష నేత మైకే పని చేయలేదు. అప్పుడాయన ‘మైక్ సార్, మైకు... ఆన్ చేయండి. మా ఖర్మ ఏమిటంటే ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వాళ్లకు ఈ ప్రసారాల కాంట్రాక్టును కట్టబెట్టారు. వాళ్ల ఫోకస్ అంతా బాబు గారి మీదే ఉంటుంది. మావి ఏవీ కనిపించవు. వినిపించవు. టీవీల్లోనైనా, మైకుల్లోనైనా...’ అని అన్నారు. మూడో సారి కూడా జగన్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు అసహనం వ్యక్తం చేయగా స్పీకర్ మాత్రం ‘వైరు తెంచుకున్నారు. మీలో ఎవరో తెంచారు’ అని పునరుద్ఘాటించడం కొసమెరుపు.
పదే పదే మొరాయించిన మైకులు
Published Tue, Sep 1 2015 4:29 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement