Assembly Monsoon Session
-
వర్షాకాల సమావేశాలు
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
తెలంగాణలో ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల రెండోవారం తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు మార్చి 15 నుంచి 26వ తేదీ వరకు జరిగాయి. ఆరు నెలలకోసారి అసెంబ్లీ భేటీ కావాల్సి ఉన్న దృష్ట్యా ఈ నెల 26 లోపు సమావేశాలు కచ్చితంగా నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతాయి. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అవి సాధ్యపడలేదు. ఈ నెల 15న సమావేశాలు ప్రారంభించి పరిస్థితులను బట్టి 8–10 రోజులపాటు కొనసాగించాలని ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి షెడ్యూల్ ఖరారు కానుంది. ఎప్పటి నుంచి ప్రారంభించి, ఎన్నిరోజులు సమావేశాలు జరపాలన్న దానిపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తమ్మీద ఈ నెల 15–20వ తేదీలోపు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. -
హడావుడి లేకుండా అసెంబ్లీ సమావేశాలు షురూ..!
సాక్షి, హైదరాబాద్: సోమవారం ప్రారంభమైన శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో విభిన్న వాతావరణం కనిపించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు, మీడియా, సందర్శకులతో సందడిగా కనిపించే అసెంబ్లీ ప్రాంగణంలో ఈసారి కరోనా నేపథ్యంలో పెద్దగా హడావుడి కనిపించలేదు. మీడియా పాయింట్ ఎత్తివేయడం, లాబీలు, గ్యాలరీలోకి సందర్శకులకు అనుమతి ఇవ్వక పోవడంతో అసెంబ్లీ పరిసరాలు బోసిపోయాయి. మంత్రులు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వ్యక్తిగత సిబ్బందిని కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. సీఎం, స్పీకర్, మంత్రులు సహా అందరూ మాస్క్‌లతో సభకు హాజరు కాగా, సభలో భౌతిక దూరం పాటిస్తూ సమావేశాల్లో పాల్గొన్నారు. సభ లోపల, బయటా కరచాలనాలు, గుమి కూడటం వంటివి లేకుండా సమావేశం వాయిదా పడిన వెంటనే ఎవరికి వారుగా తిరుగుముఖం పట్టారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటు చేసి, అందరికీ పరీక్షలు నిర్వహించారు. మాస్క్ పెట్టుకోండి.. దూరం పాటించండి : స్పీకర్ పోచారం సూచనలు సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలకు హాజరయ్యే సభ్యులంతా కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. సోమవారం సభ ప్రారంభం కాగానే జాతీయ గీతాలాపన అనంతరం ఆయన సభ్యులకు పలు సూచనలు చేశారు. సభ్యులం తా సభకు హాజరయ్యే ముందు జ్వరాన్ని తనిఖీ చేసుకోవాలని.. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే అది తగ్గేవరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్ పెట్టు కోవాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, అనవసరంగా వేటినీ తాకరాదని స్పష్టంచేశారు. రోగనిరోధక శక్తి పెంచుకునేలా పౌష్టి కాహారం తీసుకోవాలని, అనారోగ్యం ఉన్నవారితో కలవరాదని చెప్పారు. నీటి సీసాలు పంచుకోరాదని, లిఫ్టు వాడొద్దని పోచారం సూచించారు. చర్చలు సజావుగా జరిగేందుకు సహకరించాలి : మంత్రి వేముల సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై శాసనసభ, మండలిలో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లు కీలక పాత్ర పోషించాలని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. పలు అంశాలకు సంబంధించి స్వల్పకాలిక, లఘు చర్చలపై విప్‌లు అంశాల వారీగా సన్నద్ధం కావాలని తెలిపారు. సభ్యుల హాజరును పర్యవేక్షించాలని చెప్పారు. శాసనసభ, మండలిలో చీఫ్ విప్‌లు, విప్‌లతో సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి సమావేశమై చర్చించారు. సభను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు సీఎం సుముఖంగా ఉండడంతో అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో చీఫ్ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, దాస్యం వెంకటేశ్వర్లు, విప్‌లు భానుప్రసాద్‌రావు, ఎంఎస్ ప్రభాకర్, శాసనసభ విప్‌లు గంప గోవర్ధన్, గొంగిడి సునీత, బాల్క సుమన్, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
భౌతిక దూరం.. భద్రత..!
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 7న ప్రారంభం కానున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు నిర్వహించ డంపై అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. శాసనసభ, శాసన మండలి సమావేశ మందిరాల్లో సభ్యులు భౌతిక దూరం పాటించేలా సీట్ల ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. మండలిలో సీట్ల ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర వకున్నా, శాసనసభలో మాత్రం సభ్యుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అదనపు సీట్ల ఏర్పాటు పనులు కొలిక్కి వచ్చాయి. సమావేశ మందిరాల్లోకి ప్రవేశించే ద్వారాలతో పాటు ఇతర చోట్ల శానిటైజేషన్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నిర్వహణ తీరుపై మల్లగుల్లాలు.. సుమారు 15 రోజుల నుంచి 20 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తా మని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శాసనసభ సమావేశాల ప్రారంభం తొలి రోజు సభను ఎన్ని రోజుల పాటు, ఏ తరహాలో నిర్వహించాలనే అం శంపై బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే కరోనా పరిస్థితుల్లో శాసనసభను ఎన్ని రోజులు, రోజుకు ఎన్ని గంటల చొప్పున నిర్ణయించాలనే అంశంపై అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ రద్దు చేయడం, సభా సమయం కుదింపు వంటి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సభ మొదలైన వెంటనే నేరుగా తీర్మానాలు, చర్చలు ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజాప్రతి నిధులు, అధికారులు, సిబ్బంది, మీడియా తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా ముగించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం? కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సందర్శకులు, మీడియా ప్రతినిధులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోను న్నారు. సందర్శకులకు అనుమతి నిరాకరించడంతో పాటు విజిటర్స్ గ్యాలరీని కూడా మీడియాకు కేటాయించే అవకాశం ఉంది. మీడియా ప్రతినిధుల సంఖ్యను కూడా కుదించి అనుమతించాలనే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో జరిగే మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ జరిపే సన్నాహక సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మీడియా పాయింట్‌ను తాత్కాలికంగా ఎత్తివేయడంతో పాటు, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను యూట్యూబ్‌లో ప్రసారం చేయడంలోని సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తు న్నట్లు తెలిసింది. త్వరలో నిర్వహించే సమీక్షలో సమావేశాల నిర్వహణ తీరుతెన్నులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
రెండో రోజు వర్షాకాల సమావేశాలు ప్రారంభం
అమరావతి: ఏపీ అసెంబ్లీలో రెండో రోజు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణతో పాటు మరో 8 మంది మాజీ శాసనసభ సభ్యులకు ఉభయసభలు సంతాపం తెలపనున్నాయి. డ్వాక్రా రుణాల మాఫీ, రాష్ట్రంలో భూముల పునఃపరిష్కార సర్వే, భాషా పండితుల పదవులస్థాయి పెంపు, చెరుకు రైతులకు విత్తనంపై సబ్బిడీ, పేదలకు ఇళ్లపట్టాలు, అంగన్వాడీ ఆయాల అర్హతలు, ఖాళీగా ఉన్న పదవుల భర్తీ, బనగానపల్లె నియోజకవర్గంలో రాళ్ల పేల్చివేత కార్యకలాపాలు, గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకం, రాష్ట్రంలో పడిపోతున్న విద్య నాణ్యత, నీటిపారుదల రంగం వంటి అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు రానున్నాయి. అలాగే విశాఖపట్నం జిల్లాలో దివీస్ ఫార్మా వల్ల కాలుష్యం, ఎన్టీఆర్ విద్యోన్నతి, నిరుద్యోగ భృతి, న్యాయవాదుల సంక్షేమం, ఉపాధి కల్పనా కేంద్రాలు, మహిళలపై దురాగతాలు, ఎంజీఎన్ఆర్ఈజీ నిధులు, అనంతపురం జిల్లాలో ఎంజీఎన్ఆర్ఈజీ అవినీతి, కాకినాడలో హార్వర్డ్ పార్క్, పెండెకల్లులో పీహెచ్సీ, రాజధాని నగర అభివృద్ధి వంటి అంశాలు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు రానున్నాయి. -
అసెంబ్లీ పేల్చివేతకు కుట్ర
ఉత్తరప్రదేశ్ విధానసభలో విస్ఫోటక పీఈటీఎన్‌ను గుర్తించిన సిబ్బంది ► సభలో విపక్షనేత సీటు సమీపంలో పౌడర్ ►ఫోరెన్సిక్ నివేదికతో కుట్ర బట్టబయలు ► ఎన్ఐఏ దర్యాప్తుకు యూపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పేల్చివేతకు భారీ కుట్ర జరిగింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యుల భద్రతకు సవాల్ విసురుతూ సభలో ప్రమాదకర పేలుడు పదార్థం లభించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ ప్లాస్టిక్ పేలుడు పదార్థమైన పీఈటీఎన్ (పెంటా ఎరిథ్రిటాల్ టెట్రానైట్రేట్)ను విధ్వంసానికి ముందే గుర్తించటంతో భారీ ప్రమాదం తప్పింది. జూలై 12న అసెంబ్లీని శుభ్రం చేస్తున్న ఉద్యోగులకు ప్రతిపక్ష సభ్యులు కూర్చునే సీటు కింద పేపర్లో చుట్టిన పీఈటీఎన్ దొరికింది. అత్యంత భద్రత ఉండే అసెంబ్లీలో.. అదీ అసెంబ్లీ హాల్లో 150 గ్రాముల పేలుడు పదార్థం దొరకటం కలకలం రేపుతోంది. దీనిపై ఎన్ఐఏ విచారణ జరపాలని యూపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీంతోపాటు అసెంబ్లీలో పనిచేస్తున్న సిబ్బందిని విచారించేందుకు కూడా స్పీకర్ హృదయ్ నారాయణ్ దీక్షిత్ ఆదేశాలు జారీచేశారు. మామూలు పౌడర్ అనుకుంటే..! యూపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. జూలై 11న బడ్జెట్ ప్రవేశపెట్టారు. తర్వాత యథావిధిగా 12వ తేదీన సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సమయంలో అసెంబ్లీ హాలును శుభ్రం చేస్తున్న సిబ్బందికి.. విపక్ష నేత రాంగోవింద్ చౌధురీ కూర్చునే సీటు సమీపంలో ఓ కాగితపు పొట్లం కనబడింది. దీన్ని విప్పిచూస్తే పౌడర్ కనిపించింది. జాగిలాలు వచ్చి పరిశీలించినా ఈ పౌడర్ ఏంటో గుర్తించలేకపోయాయి. ఈ పౌడర్‌ను స్థానిక పోలీసు స్టేషన్ ఎస్సై ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించటంతో అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. అత్యంత విధ్వంసకరమైన ప్లాస్టిక్ ఎక్స్‌ప్లోజివ్ పీఈటీఎన్ అని తేలింది. ఈ విషయాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా సభలో ప్రకటించటంతో ఎమ్మెల్యేలంతా నిశ్చేష్టులయ్యారు. కేవలం 150 గ్రాముల పీఈటీఎన్ మాత్రమే లభించిందని.. అయితే 500 గ్రాముల ఈ పౌడర్‌తో మొత్తం విధానసభ భవనాన్నే పేల్చేయవచ్చని సీఎం వెల్లడించారు. అయితే ఐఈడీ లేదా డిటోనేటర్‌తో మాత్రమే దీన్ని వినియోగించవచ్చని ఒక్క పౌడర్‌తో ఎలాంటి సమస్యా ఉండదని భద్రతాధికారులు స్పష్టం చేశారు. భద్రతపై అనుమానాలు ‘ఇదో తీవ్రమైన ఉగ్రవాద కుట్రగా భావిస్తున్నాం. సభ భద్రత మా బాధ్యత. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఈ ఘటనపై ఎన్ఐఏ విచారణకు సభ ఏకాభిప్రాయ తీర్మానం చేసింది. విధాన్ భవన్ (అసెంబ్లీ) ఉద్యోగులందరినీ పోలీసులు విచారించేందుకు అనుమతినిచ్చాం’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. సభ జరుగుతున్న సమయంలో భద్రతా వలయాన్ని దాటుకుని ఇంత విధ్వంసకర పేలుడు పదార్థం సభ లోపలకు రావటం ప్రమాదకరమని దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. సభలోపలకు ఎమ్మెల్యేలు, మార్షల్స్ తప్ప వేరెవరినీ అనుమతించేది లేదన్నారు. ఎమ్మెల్యేలు, సిబ్బంది మొబైల్ ఫోన్స్‌ను సభలోకి తీసుకురావొద్దని యోగి కోరారు. అటు అసెంబ్లీ గేట్ల వద్ద క్విక్ రెస్పాన్స్ టీం (క్యూఆర్టీ), సాయుధ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎమ్మెల్యేల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు తమ మద్దతుంటుందని విపక్ష నేత రాంగోవింద్ చౌధురీ తెలిపారు. పేల్చేస్తానన్న యువకుడి అరెస్టు ఆగస్టు 15న అసెంబ్లీని పేల్చేస్తానంటూ బెదిరించిన ఫర్హాన్ అహ్మద్ (20) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.∙అహ్మద్ తప్పుడు డాక్యుమెంట్లతో సిమ్ కొని ఫోన్‌చేసి బెదిరించాడని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుగుతోంది. క్రిస్టల్స్ రూపంలో ఉండే ఈ పీఈటీఎన్‌ను భద్రతా పరికరాలు పసిగట్టలేవు. అందుకే దీన్ని ఉగ్రవాదులు ఎక్కువగా వాడతారని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. నైట్రో గ్లిజరిన్ కుటుంబానికి చెందిన పీఈటీఎన్ బ్లాక్ మార్కెట్లో విరివిగానే లభిస్తుందని కూడా వారు తెలిపారు. గనుల్లో ఉపయోగించే ఈ మిశ్రమాన్ని చాలా దేశాలు నిషేధించాయి. 2011 ఢిల్లీ హైకోర్టులో పేలుడు (17 మంది మృతి చెందారు) ఘటన సందర్భంగా తొలిసారిగా పీఈటీఎన్ వినియోగం భారత్‌లో బయటపడింది. పీఈటీఎన్ అంటే? పెంటాఎరిథ్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్) అత్యంత శక్తిమంతమైన ప్లాసిక్ పేలుడు పదార్థం. నైట్రోగ్లిజరిన్ తరహా రసాయనిక మిశ్రమం. పౌడర్ రూపంలో, స్పటిక రూపంలో లేదా సన్నని ప్లాస్టిక్ షీట్ రూపంలో ఉంటుంది. వేడిని పుట్టించడం ద్వారా (బ్లాస్టింగ్ క్యాప్ ద్వారా సన్నటి అల్యూమినియం లేదా రాగి గొట్టానికి వైర్లతో కనెక్ట్ చేసి బ్యాటరీ ద్వారా వేడి చేస్తారు)నైనా, షాక్వేవ్ ద్వారానైనా దీన్ని పేల్చవచ్చు. మోతాదు తక్కువ.. తీవ్రత ఎక్కువ! పీఈటీఎన్ పేలుడు తీవ్రత భారీగా ఉంటుంది. అందుకే అధిక జననష్టాన్ని కోరుకునే ఉగ్రవాదులు పేలుళ్లకు దీన్ని ఎంచుకుంటారు. రవాణా, నిలువ చేయడం తేలిక, సురక్షితం కూడా. పేల్చినపుడు మాత్రం భీకరమైన శక్తి వెలువడుతుంది. తక్కువ మోతాదుతోనే భారీనష్టం కలిగించవచ్చు. 1894లో జర్మనీ పేలుడు పదార్థాల ఉత్పత్తి సంస్థ ‘స్ప్రెంగ్‌స్టోఫ్’ మొదటిసారిగా దీన్ని ఉత్పత్తి చేసి పేటెంట్ పొందింది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత వాణిజ్యస్థాయిలో విస్తృత వినియోగంలోకి వచ్చింది. పీఈటీఎన్ సాధారణ ఎక్స్‌రే స్కానర్లకు, మెటల్ డిటెక్టర్లకు దొరకదు. పైగా ప్లాస్టిక్ షీట్ రూపంలో ఉన్నపుడు దీన్ని ఏ ఆకృతిలోకైనా మార్చవచ్చు. అనుమానం రాకుండా ఏదైనా వస్తువులో దాచేయొచ్చు. శరీరానికి అతికించేయొచ్చు. ఎలక్ట్రికల్ వస్తువుల్లో దాస్తే పట్టుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొనే వాణిజ్య తయారీ సంస్థలు పీఈటీఎన్‌ను గుర్తించేందుకు వీలుగా దాంట్లో కొన్ని పదార్థాలను కలుపుతున్నాయి. అయితే.. కాస్తంత రసాయన శాస్త్ర పరిజ్ఞానంతో మార్కెట్లో సులువుగా దొరికే పదార్థాలతోనే పీఈటీఎన్‌ను తయారు చేస్తున్నారు. విమానాల్లో రెండు యత్నాలు 2001లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కూల్చడానికి బ్రిటన్‌కు చెందిన రిచర్డ్ రీడ్ విఫలయత్నం చేశాడు. బూట్లలో పెంటాఎరిథ్రిటాల్ టెట్రానైట్రేట్‌ను దాచి విమానం ఎక్కాడు. పేలకపోవడంతో చేత్తో అంటించే ప్రయత్నం చేశాడు. తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది సకాలంలో అతన్ని బంధించారు. 2009 క్రిస్మస్ రోజు డెట్రాయిట్కు వెళుతున్న నార్త్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని పీఈటీఎన్‌తో పేల్చడానికి ఉమర్ ఫరూక్ అబ్దుల్ ముతల్లాబ్ విఫలయత్నం చేశాడు. లోదుస్తుల్లో దాచిన పీఈటీఎన్‌ను పేల్చడానికి ఉమర్ సిరంజితో పలు రసాయనాలను అందులోకి జొప్పించాడు. అయితే బాంబు పేలకుండా అతని తొడ కాలిపోయింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పదే పదే మొరాయించిన మైకులు
- ప్రతిపక్ష నేత మైకుకే ఇబ్బంది సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల తొలిరోజు సమావేశాల్లో మైకులు ప్రత్యేకించి విపక్షం వైపున్నవి మొరాయించడంతో ప్రతి పక్ష వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మైకులు ఎందుకు మొరాయిస్తున్నాయో పరీ క్షించి, బాగు చేయమని ఆదేశించాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాదరావే ‘మీలో ఎవరో వైరు తెంచుకున్నారని’ వ్యాఖ్యానించడం గమనా ర్హం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళులర్పించే సమయంలో జగన్ తొలిసారి మాట్లాడినప్పుడు బాగానే ఉన్న మైకు ఆ తర్వాత మూగబోయింది. మైకు పని చేయడం లేదని గమనించిన సిబ్బంది.. జేబుకు పెట్టుకునే మైక్రోఫోన్ తెచ్చి అమర్చారు. ఈ దశలో జగన్ ‘శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా మాకు మైకులు రావు. వాళ్లకు(అధికార పక్షానికి) మాత్రం వస్తాయి. గొప్ప మేనేజ్మెంట్ జరుగుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు, వైఎస్సార్సీపీ సభ్యుడు సుజయ్ కృష్ణ రంగారావు ముందున్న మైకులు పని చేయలేదు. ఈ దశలో స్పీకర్ ‘వైరు ఎవరో కట్ చేసుకున్నట్టున్నారు’ అని వ్యాఖ్యానించారు. పుష్కరాల మృతులకు సంతాపం తెలిపే తీర్మానం చర్చ సందర్భంలోనూ ప్రతిపక్ష నేత మైకే పని చేయలేదు. అప్పుడాయన ‘మైక్ సార్, మైకు... ఆన్ చేయండి. మా ఖర్మ ఏమిటంటే ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వాళ్లకు ఈ ప్రసారాల కాంట్రాక్టును కట్టబెట్టారు. వాళ్ల ఫోకస్ అంతా బాబు గారి మీదే ఉంటుంది. మావి ఏవీ కనిపించవు. వినిపించవు. టీవీల్లోనైనా, మైకుల్లోనైనా...’ అని అన్నారు. మూడో సారి కూడా జగన్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు అసహనం వ్యక్తం చేయగా స్పీకర్ మాత్రం ‘వైరు తెంచుకున్నారు. మీలో ఎవరో తెంచారు’ అని పునరుద్ఘాటించడం కొసమెరుపు. -
'ఆ యాత్రకు మా ఎమ్మెల్యేలు వెళ్లరు'
హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్యేలను 3 రోజుల పాటు పర్యటనలకు తీసుకెళ్లాలన్న స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ యాత్రకు వెళ్లకూడదని తమ పార్టీ ఎమ్మెల్యేలంతా నిర్ణయించారని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర పరిస్థితులు బాలేదని చెబుతూనే ఇలా విహారయాత్రలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కేవలం 5 రోజుల్లో ముగించాలన్న నిర్ణయానికి తాము వ్యతిరేకమన్నారు. కనీసం 20 రోజులైన సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనేక ప్రజా సమస్యలపై ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రజా సమస్యలపై తన వైఖరిని అసెంబ్లీలో వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.