
కొత్త జిల్లాలకు వైద్య, ఆరోగ్య అధికారులు
సాక్షి, హైదరాబాద్: దసరా నాటి నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులను నియమించారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది.
మొత్తం 31 జిల్లాలకు అధికారుల పేర్లతో జాబితా విడుదలైంది. వీరిలో కొందరు ఇప్పుడున్న స్థానంలోనే కొనసాగుతుండగా, కొత్త జిల్లాలకు మాత్రం కొత్తవారిని కేటాయించారు. అవసరమైన మార్పుచేర్పులతో తుది ఉత్తర్వులు వెలువడాల్సిఉంది. ప్రస్తుతానికి లభించిన సమాచారం మేరకు ఏయే జిల్లాలకు ఎవరిని కేటాయించారంటే..
1) హైదరాబాద్ - డాక్టర్ పద్మజ
2) ఆదిలాబాద్ - డాక్టర్ సుబ్బారాయుడు
3) మంచిర్యాల - డాక్టర్ భీష్మ
4) నిర్మల్ - డాక్టర్ జల్పత్ నాయక్
5) ఆసిఫాబాద్ - డాక్టర్ టి.చందు
6) నిజామాబాద్ - డాక్టర్ జె.వెంకట్
7) కామారెడ్డి - డాక్టర్ పి.చంద్రశేఖర్
8) కరీంనగర్ - డాక్టర్ రాజేశం
9) జగిత్యాల - డాక్టర్ సుగంధిని
10) పెద్దపల్లి - డాక్టర్ బిక్షపతి
11) సిరిసిల్ల - డాక్టర్ రమేష్
12) సంగారెడ్డి - డాక్టర్ గాయత్రీదేవి
13) మెదక్ - డాక్టర్ అమర్‌సింగ్ నాయక్
14) సిద్దిపేట - డాక్టర్ యు.రామకృష్ణ
15) వరంగల్ అర్బన్ - డాక్టర్ సాంబశివరావు
16) వరంగల్ రూరల్ - డాక్టర్ ఎ.అశోక్ ఆనంద్
17) భూపాలపల్లి - డాక్టర్ అప్పయ్య
18) మహబూబాబాద్ - డాక్టర్ డి.శ్రీరాం
19) జనగాం - డాక్టర్ బి.హరీష్‌రాజ్
20) ఖమ్మం - డాక్టర్ కొండల్‌రావు
21) కొత్తగూడెం డాక్టర్ - బి.వెంకటేశ్వర్‌రావు
22) నల్లగొండ - డాక్టర్ భానుప్రసాద్ నాయక్
23) సూర్యాపేట - డాక్టర్ టి.మురళీమోహన్
24) యాదాద్రి - డాక్టర్ కాళిదాసచారి
25) రంగారెడ్డి - డాక్టర్ హరీష్‌చంద్రరెడ్డి
26) వికారాబాద్ - డాక్టర్ దశరథ్
27) మేడ్చల్ - డాక్టర్ భానుప్రకాష్
28) మహబూబ్‌నగర్ - డాక్టర్ శ్రీనివాసులు
29) నాగర్‌కర్నూలు - డాక్టర్ సుధాకర్
30) వనపర్తి - డాక్టర్ నాగారం
31) గద్వాల - డాక్టర్ కె.కృష్ణ