
మోడీపై ఖుర్షీద్ వ్యాఖ్యలను ఆమోదించను:రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తాను ఆమోదించనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు, భాషను తాను అభినందించనని తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్లను అదుపుచేయలేకపోయిన మోడీ ఒక నపుంసకుడంటూ ఖుర్షీద్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా.. రాహుల్ ఇదే నేర్పుతున్నారా? అంటూ ప్రశ్నించింది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో ఖుర్షీద్ వ్యాఖ్యలను ఖండించినట్లు రాహుల్ మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.