దేశ రాజధాని న్యూఢిల్లీలో గత అర్థరాత్రి స్వల్ప భూకంపం సంభవించిందని భారత వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో గత అర్థరాత్రి స్వల్ప భూకంపం సంభవించిందని భారత వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. దాని తీవ్రత రిక్టార్ స్కేల్పై 3.1గా నమోదు అయిందని తెలిపింది. అర్థరాత్రి12.30 గంటల సమయంలో భూ స్వల్పంగా కంపించింది. దాంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరో గంట తర్వాత మళ్లీ భూమి స్వల్పంగా కంపించింది.
దీంతో నగర ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో భూకంపం సంభవించిన ప్రాంతాల్లోని ప్రజలు గత రాత్రి అంతా నిద్ర లేకుండా బిక్కుబిక్కుమంటు భయంతో గడిపారు. అయితే గత అర్థరాత్రి ఏర్పడిన భూకంపంపై విశ్లేషిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.