న్యూఢిల్లీ: వరదలతో కుదేలైన జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ఎప్పుడు జరపాలన్నదానిపై ఎన్నికల సంఘం వచ్చే నెల మధ్యలో నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర పరిస్థితులపై అక్కడి ప్రధాన ఎన్నికల అధికారి అక్టోబర్ 15 ప్రాంతంలో నివేదిక ఇచ్చే అవకాశముందని, దాన్ని అందుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఈసీ వర్గాలు చెప్పాయి.
అనంతరం ఎన్నికలు ఎప్పుడు జరపాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపింది. 87 సీట్లున్న ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 19తో ముగియనుంది.