ఎడల్‌వీస్ 500 కోట్ల ఎన్‌సీడీ ఇష్యూ | Edelweiss issues 500 crores NCD | Sakshi
Sakshi News home page

ఎడల్‌వీస్ 500 కోట్ల ఎన్‌సీడీ ఇష్యూ

Published Sun, Jan 12 2014 3:00 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

ఎడల్‌వీస్ 500 కోట్ల ఎన్‌సీడీ ఇష్యూ - Sakshi

ఎడల్‌వీస్ 500 కోట్ల ఎన్‌సీడీ ఇష్యూ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సేవల రంగంలో ఉన్న ఎడల్‌వీస్ అనుబంధ కంపెనీ ఈసీఎల్ ఫైనాన్స్ రూ.500 కోట్ల నాన్ కన్వర్టబుల్ డిబెం చర్స్‌ను జారీ చేస్తోంది. ఈ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తాన్ని వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు ఎడల్‌వీస్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో దీపక్ మిట్టల్ తెలిపారు. ఎన్‌సీడీ ఇష్యూ వివరాలను తెలియచేయడానికి శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3, 5 ఏళ్ల కాలపరిమితిలో జారీ చేస్తున్న ఈ ఎన్‌సీడీలపై వరుసగా 11.6%, 11.85% వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు.

 రూ.1,000 ముఖ విలువ కలిగిన ఈ బాండ్లను కనీసం పది కొనాల్సి ఉంటుంది. జనవరి 16న ఈ ఇష్యూ ప్రారంభమవుతుందని, జనవరి 27 వరకు చివరి తేదీ ఉన్నప్పటికీ ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయితే ముందుగానే ముగిస్తామన్నారు. ప్రస్తుతం రిటైల్, ఎస్‌ఎంఈ రంగాలపై అధికంగా దృష్టిసారిస్తున్నామని, వడ్డీ లాభదాయకతపై ఎటువంటి ఒత్తిడి లేదని ఎడల్‌వీస్ రిటైల్ ఫైనాన్స్ హెడ్ అనిల్ కొత్తూరి తెలిపారు. ఈ ఇష్యూకి కేర్ ఏఏ రేటింగ్ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement