మొబైల్ ఫోన్‌లో ఎన్నికల గీతం | Elections song in mobile phone | Sakshi
Sakshi News home page

మొబైల్ ఫోన్‌లో ఎన్నికల గీతం

Published Wed, Nov 20 2013 3:04 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

Elections song in mobile phone

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ) తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్‌నే ప్రచారకర్తగా ఎంచుకుంది. ‘దిల్ మే హై దిల్లీ’ గీతం ద్వారా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఓ సందేశాన్ని ఢిల్లీ ఓటర్లకు పంపేందుకు నిర్ణయించింది. దీనికిగాను 9 మొబైల్ ఆపరేటర్లతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ‘ఈ గీతాన్ని కాలర్ ట్యూన్లు, రింగ్ టోన్లుగా మార్చాలని ఆపరేటర్లను కోరాం. ఓటు హక్కుపై నగరవాసుల్లో అవగాహన క ల్పించడమే దీనిప్రధాన ఉద్దేశం’ అని ఈసీ అధికారి అంకుర్ గార్గ్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ గీతం అందరినీ సులభంగా ఆకర్షిస్తుందని, ఫలితంగా ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement