
'పాలన చేతకాకపోతే దిగిపోవాలి'
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్పై టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు బుధవారం హైదరాబాద్లో మండిపడ్డారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్పై టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు బుధవారం హైదరాబాద్లో మండిపడ్డారు. పాలన చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని గవర్నర్ నరసింహన్కు ఎర్రబెల్లి సూచించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికి ఏసీబీ వస్తోందని ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ అరెస్ట్ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఇరు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు వేర్వేరుగా గవర్నర్ నరసింహన్ను కలిసి వివరించారు. టీటీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు ఏసీబీ మంగళవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. దీంతో నరేందర్ రెడ్డి బుధవారం ఉదయం ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఇంత జరుగుతున్నా గవర్నర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని టీటీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.