ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో జోష్ తో మార్కెట్లు ఆరంభంలోనే సెంచరీ కొట్టాయి. అయితే ప్రస్తుతం స్వల్పంగా వెనక్కి తగ్గి సెన్సెక్స్ 82 పాయింట్లు లాభంతో 29,010వద్ద నిఫ్టీ 26పాయింట్లు బలపడి 8,952 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్ మరోసారి 29,000 పాయింట్ల మైలురాయిని దాటగా, నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 8,950ను అధిగమించింది.
ప్రధానంగా ఐటీ, మెటల్, రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు పుంజుకుటుండగా, ఆయిల్ అండ్ గ్యాస్ బలహీనంగా ఉంది. హీరో మోటో కార్ప్ టాప్ గెయినర్‌గాను, పవర్‌గ్రిడ్ టాప్ లూజర్‌గా ఉంది. అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి ఐటీ షేర్లలో కొనుగోళ హవా కనపిస్తోంది. వాటితోపాటు, భారత్ ఫోర్జ్, హెచ్‌సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, అంబుజా లాభపడుతుండగా, గెయిల్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్ నష్టాలు కొనసాగుతున్నాయి.
అటు డాలర్ మారకంలో రూపాయి కొద్దిగా బలపడి0.03 పైసల లాభంతో రూ. 66.68 వద్ద ఉంది. బంగారం ధరలుమరింత క్షీణించాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ.89 నష్టంతో రూ. 28,357 వద్ద ఉంది.