ఎగ్జిట్ పోల్స్ ముందు మార్కెట్లు ఫ్లాట్
Published Thu, Mar 9 2017 3:58 PM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM
ముంబై : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మరికొన్ని గంటల్లో విడుదల కానున్న నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 27.19 పాయింట్ల లాభంలో 28,929.13 వద్ద, నిఫ్టీ 2.07 పాయింట్ల లాభంలో 8927 వద్ద సెటిల్ అయ్యాయి. ఎస్బీఐ, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్ నేటి మార్కెట్లో 1-1.5 శాతం లాభాలు పండించగా... డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, విప్రో, గెయిల్, టాటా స్టీల్ 1-5 శాతం పడిపోయాయి.
నష్టాలు గడించిన షేర్లలో డాక్టర్ రెడ్డీస్ 4.65 శాతం, గెయిల్ 5.13 శాతం పడిపోయ్యాయి. మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ నిన్నటితో ముగిసింది. మరో రెండు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్న తరుణంలో నేటి సాయంత్రం ఐదున్నర గంటలకు వివిధ మీడియా సంస్థలు తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించనున్నాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఎలా వస్తాయోనని ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 0.08 పైసలు పడిపోయి 66.75గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా రూ.117 నష్టంతో 28,512 వద్ద ముగిశాయి.
Advertisement
Advertisement