
వైష్ణోదేవికి ‘నకిలీ’ కానుకలు
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లోని ప్రసిద్ధ వైష్ణో దేవీ ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల్లో 43 కేజీల బంగారం.. 57 వేల కిలోల వెండి నకిలీవేనట. సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా ఈ విషయం వెల్లడైంది. గత ఐదేళ్లలో వైష్ణోదేవికి 193.5 కేజీల బంగారం.. 81,635 కిలోల వెండిని భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. ఇందులో 43 కేజీల బంగారం.. 57,815 కిలోల వెండి నకిలీవని తేలిందని ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎంకే భండారి చెప్పారు.