చెన్నై: విదేశీ మారక ద్రవ్యం నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కోర్టు విచారణలో పాల్గొన్నారు. బెంగళూరులోని అగ్రహారం జైలులో ఉన్న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెన్నైలోని ఎగ్మూర్ ఆర్థిక నేరాల విచారణ కోర్టు విచారించింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి జకీర్ హుస్సేన్ అడిన ప్రశ్నలకు శశికళ.. ‘గుర్తు లేదు’, ‘తెలియదు’ అంటూ సమాధానాలు దాటవేశారు. శశికళ జైలు దుస్తుల్లోనే విచారణలో పాల్గొన్నారు. తదుపరి విచారణ 13వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజున ఈడీ తరపున ఆమెను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం కల్పిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
జయ టీవీ(జేజే టీవీ)కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోళ్లకు డాలర్ల రూపంలో సాగిన నగదు బట్వాడాను ఈడీ గుర్తించింది. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళలపై నాలుగు కేసులు నమోదయ్యాయి. జైలులో ఉన్నందున విడియో కాన్ఫరెన్స్ విచారణకు అనుమతించాలన్న శశికళ అభ్యర్థనకు ఎగ్మూర్ కోర్టు అంగీకారం తెలిపింది.
జైలు దుస్తుల్లో ప్రత్యక్షమైన శశికళ
Published Sat, Jul 1 2017 10:31 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM
Advertisement
Advertisement