న్యూఢిల్లీ: బీఎన్‌పీ పరిబాసహా 12 పెట్టుబడి ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహక బో ర్డు(ఎఫ్‌ఐపీబీ) సిఫారసు మేరకు ప్రభుత్వం మొత్తం రూ. 343 కోట్ల విలువైన 12 ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. కాగా, యూఎస్ కంపెనీ మైలాన్ చేసిన ప్రతిపాదనపై నిర్ణయాన్ని పక్కనబెట్టింది. జనరిక్ ఔషధాల దేశీయ కంపెనీ ఏగిలా స్పెషాలిటీస్‌ను కొనుగోలు చేసేందుకు స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్‌తో మైలాన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 5,168 కోట్లను వెచ్చించనుంది. ఏగిలా స్పెషాలిటీస్... స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్‌కు అనుబంధ సంస్థ.