ఆప్ ఎమ్మెల్యే భర్తపై ఎఫ్ఐఆర్ | FIR filed against AAP MLA's husband | Sakshi
Sakshi News home page

ఆప్ ఎమ్మెల్యే భర్తపై ఎఫ్ఐఆర్

Published Sat, Jul 11 2015 5:52 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

FIR filed against AAP MLA's husband

న్యూఢిల్లీ:నగరంలోని సర్వోదయ విద్యాలయా ప్రిన్సిపాల్ ను వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే బందనా కుమారి భర్త సజ్జన్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది.  ఓ అడ్మిషన్ విషయంలో సజ్జన్ కుమార్ తనను వేధించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంటూ సర్వోదయ విద్యాలయా ప్రిన్సిపాల్ రంజిత్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

గత బుధవారం సజ్జన్ కుమార్ నుంచి ఓ కాల్ వచ్చిందని.. ఆ కాల్ లో ఎటువంటి పరిచయం లేకుండానే తనను కలవాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారని రంజిత్ సింగ్ పేర్కొన్నాడు. అనంతరం సజ్జన్  స్కూల్ కు వచ్చి నానా హంగామా సృష్టించారని సదరు ప్రిన్సిపాల్ పేర్కొన్నాడు. తన స్కూళ్లో ఆయన సూచించిన వ్యక్తికి అడ్మిషన్ ఇవ్వకపోవడంతో తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని రాత పూర్వక ఫిర్యాదులో స్పష్టం చేశాడు. ఆ ఘటనకు సంబంధించి రికార్డు అయిన వీడియోను కూడా రంజిత్ సింగ్ సమర్పించినట్లు పోలీసు అధికారి తెలిపారు.దీంతో సజ్జన్ కుమార్ పై 146, 353, 506/34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు అధికారి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement