గామా-2013లో ఫంక్షన్ లో తారల తళుకులు | gama -2013 awards function on january 31st | Sakshi
Sakshi News home page

గామా-2013లో ఫంక్షన్ లో తారల తళుకులు

Published Sat, Jan 18 2014 6:24 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

గామా-2013లో ఫంక్షన్ లో తారల తళుకులు - Sakshi

గామా-2013లో ఫంక్షన్ లో తారల తళుకులు

దుబాయ్ లో గామా-2013లో సినీ తారలు సందడి చేయనున్నారు. అందాల తారలు ఛార్మి, కామ్న జఠ్మలాని, పూనమ్ బజ్వాలు డాన్స్ లతో తెలుగు వారిని మైమరిపించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, కమెడియన్లు హాజరుకానున్నారు.

సినిమాలపట్ల ఉన్న మమకారంతో, కళాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో గత పదేళ్లుగా దుబాయ్ లో ఎన్నో రకాల కార్యక్రమాలను నిర్వహించింది గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్. ఈ ఏడాది కూడా గామా-2013 పేర మ్యూజికల్ అవార్డ్స్ ఫంక్షన్ ని ఈ నెల 31న దుబాయ్ లో నిర్వహించనుంది. ఈ విషయాన్ని శనివారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ ఛైర్మన్ కేసకి త్రిమూర్తులు తెలిపారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా చేయబోతున్నామన్నారు. 2013లో విడుదలైన చిత్రాల్లోంచి బెస్ట్ సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా 11కేటగిరిలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. 5,000 మంది తెలుగు ప్రజల మధ్య జరగునున్న ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని ఆశిస్తున్నట్లు త్రిమూర్తులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement