గంగ్నామ్ 'సై' కారుకు యాక్సిడెంట్ | 'Gangnam Style' star Psy's car collides with bus | Sakshi
Sakshi News home page

గంగ్నామ్ 'సై' కారుకు యాక్సిడెంట్

Published Fri, Jul 17 2015 3:14 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

గంగ్నామ్ 'సై' కారుకు యాక్సిడెంట్ - Sakshi

గంగ్నామ్ 'సై' కారుకు యాక్సిడెంట్

లండన్: ఓపెన్ గంగ్నామ్ స్టైల్ అనే పాట మీకు గుర్తుండే ఉందికదా.. ఇప్పటికీ పార్టీల్లో, పెళ్లిల్లో, ఇతర సాంస్కృతిక కార్యకలాపాల్లో ఈ పాట లేదంటే అక్కడ హుషారే లేదన్నట్లు. అంత కిర్రాక్ పాటను పాడి అందరి గుండెల్లో నిలిచిపోయిన దక్షిణ కొరియా పాప్ సింగర్ 'సై' ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

చైనాలో ఆయన ప్రయాణిస్తున్న కారు రోల్స్ రాయస్ వేగంగా ఓ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆయన వాహనం ముందుభాగం దెబ్బతిన్నది. అయితే, సైకి మాత్రం ఎలాంటి గాయాలవలేదని తెలిసింది. గురువారం మధ్యాహ్నం తూర్పు చైనాలోని విమానాశ్రయం నుంచి జిజియాంగ్లోని ఓ హోటల్కు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం నెలకొంది. ఓ బార్లో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు సై అక్కడికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement