బస్సును, కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.
శ్రీకాకుళం : బస్సును, కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన శ్రీకాకుళం రూరల్ మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. జిల్లాలోని పలాసకకు చెందిన వ్యాపారి కిషోర్ బాబు పుష్కర స్నానాలకు కుటుంబంతో కలసి వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీకొంది. దీంతో కిషోర్ బాబు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.