న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ కొలువుదీరినా.. మహిళలకు ఇంకా అభద్రత తొలగిపోలేదు. దేశ రాజధానిలో కామాంధులు మరోసారి రెచ్చిపోయారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు ఆటో డ్రైవర్లను గురువారం అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి బాలిక ఏదో పనిపై ఇంటి నుంచి బయటకు వచ్చి జీటీబీ ఆస్పత్రి ప్రాంతంలో తిరిగిందని.. బుధవారం రాత్రికి తూర్పు ఢిల్లీలోని బోపురా ప్రాంతానికి చేరుకుందని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో బాలికను గమనించిన ఆటో డ్రైవర్లు తమవెంట తీసుకెళ్లి అత్యాచారం చేశారన్నారు. వైద్యపరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది.