ట్రంప్ను వ్యతిరేకిస్తున్న టెక్ దిగ్గజాలు ఆనాడు...
ట్రంప్ను వ్యతిరేకిస్తున్న టెక్ దిగ్గజాలు ఆనాడు...
Published Wed, Feb 8 2017 8:27 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న టెక్ దిగ్గజాలు జనవరిలో జరిగిన అమెరికా అధ్యక్షుడు ప్రారంభోత్సవ సమయంలో విపరీతంగా ఖర్చుచేశాయట. నగదు, సర్వీసుల రూపంలో ఈ దిగ్గజాలు అధ్యక్షుడి ప్రారంభోత్సవానికి విరాళాలు అందించాయని పొలిటికో మంగళవారం రిపోర్టు చేసింది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్లు ట్రంప్ ప్రారంభోత్సవానికి సాయం చేశాయని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక్కటే నగదు రూపంలో 250,000 డాలర్లు(రూ.1,67,62,125) విరాళంగా ఇచ్చిందట. అదే మొత్తంలో తన సర్వీసులను అందజేసిందని తెలిసింది.
అయితే ఈ ప్రారంభోత్సవంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఎలాంటి నగదును విరాళంగా ఇవ్వలేదంట. కానీ ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ రూపంలో సాయం అందించిందట. ఈ ప్రారంభోత్సవం అయిన వారంలోనే ఈ టెక్ దిగ్గజాలన్ని ట్రంప్ ఇమ్మిగ్రేషన్ బ్యాన్కు వ్యతిరేకంగా నిరసన గళం విప్పిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా కార్పొరేట్ అమెరికా ప్రారంభోత్సవ కమిటీకి డొనేట్ చేస్తూ వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా రెండోసారి ప్రారంభోత్సవ సమయంలో మైక్రోసాఫ్ట్ 2 మిలియన్ డాలర్ల నగదు, సర్వీసులను డొనేట్ చేసింది.
Advertisement
Advertisement